పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

పండ్రెండురాజుల కథలు.


బహుళః నీవు నాసోదరుఁడగు నీల కేతనుని వృత్తాంతము వక్కాణించుచుందును. నేనును నాసోదరు నన్వేషించుచు నిందు సంచరించుచున్నా” నని పలికి తాను కాంతయగుటయుఁ దన సర్వవృత్తాంతమును నెఱిఁగించి రాజపుత్రికను సందర్శించి సంభాషించుటకై——పురుషాకృతిని విడనాడి నిజరూపముతో సునంద వెంట రాజాంతఃపురమున కరిగెను.

కుంతల రాజకుమారుఁ డగుమాణిభద్రుఁ డానాడు స్త్రీ రూపమున నున్న నీలకేతనుఁ గాంచినది మొదలు, మదన బాణహతుఁడై పరితపించుచు, ననుదినంబును సుసందతోఁ దనసంక్షోభముం జెప్పుకొనుచు సక్కంజాక్షి మఱల నీపురి కెవుడువచ్చుననియడుగుచు దిన మొక యుగముగా గడుపుచుండెను. ఆదినమున మణిమంజరియు పాంచాలయు సంభాషించు నదనున, మాణిభద్రుం డటకరుదెంచి, పాంచాలంగని తావలచిన కాంత యదియేయని భ్రమించె——పాంచాలయు నామోహనాంగునిగని కామ వశయయ్యెను. ఆయువతీయువకుల హృదయగతాభిప్రాయంబుల నెఱింగి, మణిమంజరీ సునందలు వారిరువురకును అన్యోన్య సంభాషణాను కూల్యముం గలిగించిరి. అప్పుడా రాజపుత్రుఁ డాపుత్తడి బొమ్మ ననేక విధంబుల బ్రతిమాలి తన్ను బరిణయమాడుమని వేడుకొస, నాకాంత "ఆర్యా! నాసోదరునియునికి నెఱుంగునందాక నే నీశుభకార్యంబున కనుమతింపఁబోను. నేనాతని నన్వేషించి తెచ్చిన పిదప, రెండు వివాహములు నేకకాలంబునఁ గాదగునని పలికి యాతనిననుమతింపఁ జేసి, మరల నీలకేతను నన్వేషింప ఋరుషాకృతితో, సఖీద్వితీయమై మఱియొక పురంబున కరిగెను. అట్లుచనిన పొంచాల యొకచో శయనించియుండ——యక్షేశ్వరునిచే నీలకేతన ప్రతిరూప పటసహితంబుగఁ బంపఁబడిన, చారులు పురుషాకృతితోనున్న పాంచాలంగని, నీలకేతనుఁడని భ్రమించి, స్వకీయ మాయాబలంబున నిజలోకమునకుఁగొని చని, కళానిలయ శయ్యాతలంబున శయనింపఁ జేసిరి. కళానిలయయు నాకాంతను గుఱ్తింపనేరక నిజనాధుఁడేయని భ్రమించి నిద్దురలో ముద్దాడుకొని, పాంచాల