పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీల కేతనమహారాజు కథ.

69


నీయైహికచింతలందవిలి యెన్ని నాళ్లిట్లు కూపస్థ మండూకంబువోలె మెలంగి పతితుండవయ్యెదవు? నీకు మహాజన దుర్లభంబగు సాకార ప్రభావంబు నెఱిఁగించెదను. అందువలన నీవు తరింపఁగల" వని యుపదేశించె.

ఆనాడట్లు నీలకేతను నిలాతలంబునకుఁ ద్రోయించినపిదప యక్షేశ్వరుండు, తన తనయ గర్భవతియయ్యెనని యెఱింగి, పతికొఱకై సుత జెందు దుఃఖముంగాంచి, భరింపఁజూలక తుదకెట్లైన నాతనినే యన్వేషించి యల్లునిగా నొనరించుకొన నభిలషించి, యాతఁడు మానవుండని తన తనయవలన నెఱింగి, యామె వ్రాసియిచ్చిన నీల కేతననుని ప్రతిరూపంబులను చారులకిచ్చి భూతలంబున కంపెను.ఈలోపల సహోదరునన్వేషింప దేశయాత్రగావించుచుండిన, పాంచాల పురుషాకృతితో, క్రమంబున, కుంతల రాజధాని కరుదెంచి పురుషరూపముతో నున్న సఖితో నొక సత్రంబున విడిసియుండెను. ఆ పురి రాజపుత్రికకు తలిదండ్రుల కెఱుక లేకుండ గర్భోత్పన్న మయ్యెననియు నీల కేతనుఁ డనునొక రాజపుత్రుం డామెంగలసినట్లా రాజపుత్రిక పచించుచుండెననియు రాజేంద్రుఁ డాతనికై వెదకించుచుండెననియు, సత్రాగత పౌరజనంబులవలన నాలకించి, యరాజపుత్రికతో మాటలాడ దలంచి యుండెను, అనంతర మెందేని మార్గాంతరంబునం జనుసునంద యాసత్రంబున కరుదెంచి, తటాలునఁ బురుషాకృతితో నందున్న పాంచాలనుగాంచి నీలకేతనునిగా భ్రమించి వినయసంభ్రమములతో నాతం డగ్గఱి——నమస్కరించి—— “రాజపుత్రా! ఇట కెప్పుడు వచ్చితివి? ఇన్ని నాట్లు నెందుంటివి? నా చెలి నీకై బెగఁగొనియున్నది; రాజేంద్రుఁడు నీచరిత్రంబునంతను నాకర్ణించి నిన్ను జామాతనుగా స్వీకరింప నుద్యుక్తుఁడై యున్నాఁడు. ఈ సత్రంబున నుండనేల? రమ్ము——నా చెలికి నేత్రపర్వం బొనరించి రాజానుమతంబున పెండ్లికుమారుఁడవు గమ్ము——” అని త్వర పెట్టుచున్న సునంద పొరపాటు నెఱింగి పాంచాల నవ్వి—— “సుదతీ! నీవెవ్వతెవో నేనెఱుంగను;