పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

నీల కేతనమహారాజు కథ.


యాకాశమార్గంబున యక్షలోకంబునకరిగి, నిజమందిరంబున నొక హంసతూలికాతల్పంబున శయనింపఁ జేసి, నిద్దుర లేపి తన యిష్టంబు నెఱిఁగించెను. ఆ పలుకులు విని, యా సుకుమారుం డాశ్చర్యభయచేతస్కుండై—— “యయ్యారే! ఎక్కడి భూలోకము? ఎక్కడి యక్షలోకము? దైవజ్ఞులయానతిమీరివచ్చిన నా కిదియే కష్టారంభ సూచకము కాఁబోలు" నని వాపోవుచుండ నా కళానిలయ యాతనికి ధైర్యంబు గఱపి వానితో సురత క్రీడాసుఖంబు నందుచుండెను. ఇట్లు కొన్ని నాళ్లు రహస్యంబుగ నీ వ్యాపారంబు జఱుగుచుండఁ దొలుత నామె సఖులయందు గుసగుస లారంభమై తుద కానోట నానోటంబడి, యక్షేశ్వరునకు దెలియ నాతం డాగ్రహోదగ్రుఁడై——యిరువురు భటులచే నాతని నిలాతలంబునకుఁ ద్రోయించెను. అట్లు త్రోయంబడిన నీలకేతనుం డొక యుద్యానంబునంగల పొదరింటంబడి, బహుతరోన్నతినుండి పతితుండైనకతంబునఁ బ్రాణంబులన్ను బట్టి మృతునిగతిం గదల మెదలక యుండెను. ఆ రాత్రి కాలంబున చల్లగాలి సుఖంబునకై తదుద్యానవనంబున శయనించిన, యుక రాజపుత్రికయు నామె సఖియు నాధ్వని నాలించి మేల్కాంచి, విస్మితులై——మన్మధుని ధిక్క రించు సౌందర్యంబునఁ విరాజిల్లుచు జచ్చినట్లు పడియున్న నీలకేతునుంగని జాలినంది యోక తల్పంబున్ఁ బరుఁడఁ జేసి సపర్యల మేల్కొలిపిరి. రాజు పుత్రుఁడు లబ్ధప్రాణుఁడై దిశలంబరికించి తొలుత నాకామినింగని, కళానిలయగా భ్రమనంది, మరలఁ గాదని గ్రహించి భయాశ్చర్యములతో——"నో కాంతలారా! ఇది యే దేశము మీరెవ్వరు? నేనొక పర్వతమునుండి క్రిందబడినట్లు కలఁగంటిని. ఇది యింకను కలయేనా? కానిచో నేనిట కేట్లు వచ్చితిని? నా కళానిలయ యేమయ్యె” నని వెఱ్ఱివానివలె నడుగ, నా కాంతలలో నొకతె—— “యార్యా! ఇది కుంతల దేశము.ఈ బాల యీ దేశాధీశుండగు మణిమంతునిపుత్రిక——మణిమంజరి యనంబరగు. నేనీమెసఖినగు సునందను.ఇందుమేము చల్లగాలికి శయనించి యుండ నీ వాకాశమునుండి యిందు