పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

56

పండ్రెండు రాజుల కథలు.


రాజుపేర——"నో గుడ్డి రాజా! దినదినంబున నీతనయ, యొక వైదేశికుని తోడ నీలీలో ద్యానమందిరమున మదనసుఖంబులఁ గాంచుచు సాయంకాలమున కింటికి వచ్చుచున్నయది. ఇది నీవు గుఱ్తింప కున్నావు, తెలివిగలవాఁడవేని తోడనే చని వానిని బంధింపు" మని సంతకము లేని యొక లేఖను వ్రాసి పంపిరి. విదర్భాధిపతి యా లేఖం జదువుకొని తోఁక ద్రోక్కిన కాలాహిగతి నాగ్రహించి, యంతఃపురంబున కప్పుడే చని కుమార్తెజాడనారసి యామె నిజముగా లీలోద్యానమందిరంబున కరు గుట నెఱింగి మరింత యాగ్రహముతో నటకరుగ రాజు రాకను దూరము నుండియే గ్రహించిన విలాసిని, రయంబున నరుదెంచి ప్రమాదంబువచ్చెనని రాజపుత్రు నోక నిగూడనికుంజాంతరంబున దాచి యేమియు నెఱుంగని భాతి రాజపుత్రికతో పాచికలాడుచుండెను. ఆగ్రహముతో నటకువచ్చిన రాజు పరపురుషునెవ్వని నందుగానక, యప్పటికి చీఁకటులు దిశల నాక్రమించుటచే, నాయుద్యానవనమునుండి యెవ్వరిని బయటికిగాని బయటివారిని లోనికి గాని యుదయమువఱకుఁ బోనీయవలదని రక్షకభటులకు దీవ్రమైన యాజ్ఞ నొసంగి యుదయంబున నా యంతః పుర ద్రోహిని వెదుకవచ్చు, నెందు బోవునని తలంచి నిజకుమారీ సహితుఁడై నగరి కరిగెను. జగదేక సుందరి యా రేయి భోజనంబు నొల్లక, తన మనోహరున కెట్టి కీడుమూడునోయని యాక్రందించుచుండ విలాసిని యామె కొక యుక్తి నుపదేశించి, “రాజపుత్రికను పాముకఱచినదని " పెద్ద యల్లఱి చేసెను. ఆ కోలాహలంబు నాలకించి రాజును రాణియు నశేష జనంబును నందుగుమిగూడి వాపోవదొడంగిరి. ఆస్థానమునందు పేరందిన వైద్యులందఱు మంత్ర తంత్రౌషధుల నుపయోగించి చూచిరిగాని యవియెల్ల బూదింజల్లిన పన్నీటివలె వ్యర్థంబులయ్యె. అంతవిలాసిని రాణితో “అమ్మా! నే నొకపాముమందు నెఱుంగుదును. కాని యది మన విలాసోద్యానంబునంగలదు. సాయంకాలంబున ప్రభువువారేలనో, తెల్లవాఱుదనుక బయటివారినిలోనికిని లోని