పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామవర్థనమహారాజు కథ.

57


వారిని బయటికిని బోనీయవలదని యచటి భటులకాజ్ఞయిచ్చిరి. నన్ను మాత్రము వదలుటకు ప్రభువువారాజ్ఞాపత్రిక నొసంగినచో నీక్షణంబున నాయోషథింగొనివచ్చి నాచెలిని బ్రతికింపఁగల"నని పలుక, రాణి “యోసీ! ఇంత సేపటి నుండియుఁ జెప్పనై తివేలనే? ఎట్లైన నాబిడ్డను బ్రదికింపవే! ఆజ్ఞాపత్రమెంత? నిమిషంబున నిప్పింతు" నని పలికి, రాజుచే నట్టిపత్రిక నిప్పించి విలాసినినంపెను. అంత నావిలాసిని వనపాలకుల కాశాననముంజూపి, యధేచ్ఛగా లోనికరిగి రాజకుమారుంగలసికొని జఱిగిన సంగతింజెప్పి, యాతనికి తన వేషము వేసి బయటి కంపెను. 'రాజభటులావ్యక్తిని విలాసినిగా భావించి పోనిచ్చినంతం గొంతవడికి విలాసినియే వచ్చి వారికొకమూలికంజూపి "పోయెద" నని పలుక వారు విలాసినిని గుఱ్తించి, “యౌరా! మోసపోయితిమని భావించి కన్నములోనిదొంగకు తెలుగుట్టినట్లు వాయెత్త వెఱచిరి. విలాసిని రాజపుత్రికకు మంత్రించు నెపంబునఁ జెవిలో రహస్యంబుగ “రాజపుత్రుఁడు క్షేమముగ వెడలిపోయె" నని తెలుప నామే యారోగ్యశాలినియై యందఱు కానందముం గలిగించెను. హరిదత్తుఁడు వసంతునితో జఱిగినవిషయములం దెలిపి, “మిత్రమా! ఈయూర నింక నేనుండుట ప్రమాదకరము. కావున నే నందందు సంచరించి యొకమాసంబున కిందువచ్చెదను. అంతదనుక నీవిందుండి విలాసినివలన విషయంబులం దెలిసికొనుచుండు"మని పలికి యాతని నొప్పించి యెం దేనింజనియె. అట్లు బహుదూరఁ బరిగి హరిదత్తుం డొకనాటి రేయి యొక యరణ్యంబునంగల కాళికాలయంబున నిద్దురరాగా నట శయనించెను. ఆరాత్రి నడుజాముమీరినపిదప, నటకైదుగురుదొంగలు విశేషంబగు ధనసంచయంబుతో నరుదెంచి, తమలోఁదమకు పాళ్లు దెగక, కలహించుచు, నింతలో హరిదత్తుంగాంచి యాతని పై గవయ నెంచ, హరిదత్తుం డాగ్రహంబున విజృంభించి యాయేవురిని కాళికకు బలియిచ్చెను. అంతఁ గాళికాదేవి, యారాజపుత్రునకు బ్రత్యక్షమై—— “యోరాజకుమారా! నీవు చాలనదృష్టశాలివి. ఈయేవురును ఏకగర్భ