పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కామవర్ధనమహారాజు కథ

55


రహితంబుగ నాహరిదత్తుంగాంచి మించిన మారువిరాళికి లోనయ్యె, హరిదత్తుండును నాకన్యనుగాంచి, “యయ్యారే! ఇది మనుహ్యంగన యగునా? ఐనచో విధాతచాతుర్యము ప్రస్తుతిపాత్రముగదాయని తలంచుచు మైమఱచి, యుండునంతలో సఖీప్రోద్బలంబున నాయెలనాగ యచ్చోటువాసిచనియె. హరిదత్తుండంత చేయునది లేక వసంతునితో మఱిమఱి యాబాలసోయగంబునే వర్ణించి చెప్పుచు సత్రఁబునకరిగి మదనజరార్తుండై యారేయియెల్ల వేగించెను. ఇట జగ దేక సుందరియు హరిదత్తుని రూపలావణ్యాదులనే విలాసినికి వర్ణించి చెప్పుచు "నో చెలియా! కంతుజయంత వసంతాదులను మీఱిన జగన్మోహనరూపంబుతో నొప్పారు నాయందగాఁ డెవ్వడే? ఆతఁడు నామనంబు నపహరించుకొని పోయెఁగదే! అతని పొత్తుగూడని యాడుదానిజన్మమేలనే? యని జాలి గదుర బలుక, విలాసిని తన నేర్పున హరిదత్తునియునికి నెఱింగి, యాతనితోఁ బరిచయముచేసికొని చమత్కారముగ నాతని హృదయంబును జగదేక సుందరిపై హత్తియుండుటనుగ్రహించి, “యోరాజకుమారా! నీవు కరుణింపకుఁడిన నా చెలి బ్రతుకు వట్టిదగును. ఇందులకొక వెఱ వూహించితిని, ఇది గౌరవహీనంబనితలంపక నీవొకయాఁడు వేసంబునఁ దొలుత నాయింటనుండుము. అటకు, శకటారూఢయై నా చెలి యరు దెంచ, మనమిణువురము జెలులభాతి నాశకటము పై నెక్కి, యూరి వెలుపలంగల, లీలోద్యానమందిరంబున కరుగుదము. సాయంకాలము దనుక నందుసుఖలీలలం దేలనగు పిదప మనము గృహంబునకు రాగా రాకుమారి దివాణంబునకు జను"నని యుపదేశించి యదేవిధానంబున జగదేక సుందరీ హరిదత్తుల కనుదినమును సమావేశముం గల్గించుచుండెను. వసంతుఁడు తనమిత్రుని కార్యంబు నెఱింగి, యిది ప్రమాద కరంబనియు, శీఘ్రముగ విరమింపుమనియు నెంతయో బోధించెఁగాని రాజపుత్రికా ప్రేమ బంధంబులం దవుల్కొనిన హరీదత్తుని చెవి నామాటలు నాటవయ్యే. ఇట్లు కొన్ని దినంబులు గడువ నెవ్వరో—— విదర్భ