పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుధాకరమహారాజు కథ

47

పలుక నా రాజపుత్రుం డమితానందపరవశుండై యట్లయగుంగాక యని సమ్మతించెను. అంత నాశరభృంగుండు సుధాకరువకు తారకంబును వినుమని యుపదేశించెను.

తదనంతరంబా సుధాకరుండు కొన్నినాళ్లు శరభృంగమునీంద్రు నాశ్రమంబునందుండ, నొకదినంబున, సుదాముండను నామునీంద్రశిష్యుఁ డొకం డరుదెంచి యాకుమారుండు నిర్మలమానసంబుననున్న తరి దరింజేరి——“యోరాజకుమారా! నేను, కాళీ గయాది పుణ్య క్షేత్రంబులను దర్శించి వచ్చినవాఁడను. నాసంచార కాలంబున నందం దనేక చిత్రంబుల బొడగాంచితిని. అన్నిటిమాటకేమిగాని, కాళీపురాధిపతి కొక తనూభవగలదు, ఆమె కనకాంగియగు నస్వర్ధ నామంబున నొప్పారు. ఆ మందయాన యందంబువర్ణింప వేనోళ్ల చిలువరాయనికిఁగూడ నసాధ్యంబగు ననిన, నిఁక ననుబోటి చాందసుం డెందులకుఁజాలును? ఆసతీరత్నము సౌందర్యమునెదుట రతీయు, భారతియు, శ్రీసతియు, హైమవతియు దిగదుడుపునకైనఁ బనికిరారనిన నిఁక భూలోక కాంతలమాట చెప్పనేల? ఇట్టిసంపూర్ణ సౌందర్యరాశిని సృజించిన విరించి మతిమాలి, యానాతికొక తీరని కళంకముం దెచ్చి పెట్టినాఁడు. పవలుపండ్రెండు గంటల కాలమును నా రాజకుమార్తె దుర్భరదురంతమగు నుదరబోధచే బీడింపఁబడుచు, నున్మత్తగతిం బ్రలాపించుచు, నిలాతలంబునఁబడి గిలగిలఁగొట్టుకొని పెద్ద పెట్టున నెలుంగెత్తి దిశలుమారుమ్రోగ శోకించుచుండును. తత్సమయంబున నామె శోకమునుగాంచిన రాతిగుండెలైన నవనీతంబులగతి మృదుత్వ ముందాల్చును. రాత్రులం దాబాల గాఢంబుగనిద్రించి వేకువజామున శోకారావంబులతో మేల్కొనును. రాత్రులందాబాలిక శయనించు మందిరంబున నెందఱు శయనింతురో వారందఱు తెల్లవాఱునప్పటికి మృతశరీరులై యుందురు, ఈ మహాదారుణ కార్యము నెఱింగి యొంటరిగ నాబాలిక నోకగదియం దిడి కవాటమును బంధించుచున్నారు. ఉదరబాధవలన నాబాలిక యన్న పానీయంబులను మఱచి శుష్కాం