పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

పండ్రెండు రాజుల కథలు


గియై పోయినది. తొంటి సౌందర్య మెల్ల క్షీణించి శవప్రాయయై యున్నయది. జనకుండగు కాశీరాజు, పుత్రిక బాధను నివారించినవారి కామె నిచ్చి పాణిగ్రహణంబు సల్పుటయేగాక యర్ధ రాజ్యంబు నొసంగెదనని,ప్రకటించి యాబాలిక రూపపటంబులం బంచి పెట్టుచున్నాడు. ఇయ్యదియే తత్ప్రతిరూపంబగు పటము. కామినీతృష్ణయు రాజ్యతృష్ణయు ప్రోత్సహింప ననేకు లీప్రయత్నంబునొనరించి మృత్యువువా తంబిక్కిరి. సుధాకరా! ఈకన్యక నీ కెంతయుం గూర్చునది. దేశికుల యాశీర్వచనంబు నంది నీవరిగినచో——నసాధ్యంబుగానేర"దని ప్రోత్సహింవ, సుధాకరుండా కాశీ రాజపుత్రిక రూపపటముం దిలకించి, మన్మధ బాణాహతుండై——నిట్టూర్పులునిగుడ్చి యెట్లైన నాయెలనాగపాణిని గ్రహింప సిద్ధసంకల్పుడై శరభృంగ మహర్షి పాదములంబడి యాయుదంతంబు నెఱింగించి పెద్దతడవు ప్రార్థించెను. మునినృభుండా రాజకుమారుని మనఃపూర్వకంబుగ నాశీర్వదించి "కుమారా! పోయిరమ్ము నీకు జయంబగు”నని దీవించి చేయదగిన విధానంబెల్ల నుపదేశించి పంపెను.

అంత నాసుధాకరుండు, మర్త్యాకృతినిఁ దాల్చి యిలకుడిగ్గిన సుధాకరుండోయన, గాశికాపురంబునకరిగి, యారాజోత్తముఁడగు బింబసారునిదిలకించి నమస్కరించి తానరు దెంచిన కార్యంబు నెఱిఁగించెను. అదివిని, యారాజుహసించి, “బాలకా! నీవుమిక్కిలిపసివాఁడవు. నీసౌందర్యమును తలంచినదారుణసంకల్పమును నూహించిన, నాకుమిగుల విచారంబగుచున్నది. వల దుడుగుము. నీకన్న నతిసాహసంబునవచ్చినవా రెందఱో మృతినందిరి. ఈయత్నంబునుమాని గృహంబునకరిగి సుఖిం పుము." అని పలికెను. ఐనను, సుధాకరుఁడు తనపంతంబుమానక యుంట నాయిల రేడు చేయునది లేక, సమ్మతింప నారాజకుమారుఁడు పవలెల్ల నాబాలిక యనుభవించిన దురవస్థగని తద్దయుంజింతించి, రాత్రి కాలంబున నాబాలిక నొంటరిగనుంచిన మందిరంబునఁదానును రాజాను మతంబునం బ్రవేశించి, కంటిపై ఱెప్పవ్రాల్పక నిశితఖడ్గపాణియై నిలచి