పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

పండ్రెండురాజుల కథలు


సోదరుని క్షమించి, తన దేవియగు చంద్రరేఖ పుష్కరాగ్రహారంబున నుండు టెఱింగి, యామెను రప్పించి, విశారదుండను పుత్రుండు గల్గుట కలరి యల్లారుముద్దుగాఁ బెంచుచుండెను. ఇది యిట్లుండ, నాడు కాటిపాపలచేఁ దనకు విక్రయిఁబడిన బాలికకు మల్లిక, మోహిని యను నామకరణంబొనరించి పెంచి, సమస్త విద్యలను నేర్పి యామెకు వయస్సు వచ్చినంతనే, వ్యభిచారంబునఁ బ్రవేశ పెట్ట నుంకించెను. కాని మోహిని యందుల కియ్య కొనక, తన్నుఁగామించివచ్చిన, మనోహరుల డనువానికి వేదాంతోపదేశ మొనరించి మనంబు మరలింప వాఁడు విరాగియై యామెకు మాతృభావంబున నమస్కరించి తన సాటివిటులందఱని వ్యభిచార వ్రుత్తి నుండి మరలించెను. మోహినిమూలంబునఁ దనవృత్తి నాశనంబగుటకు దుఃఖించి మల్లిక యాబాలిక ననేక బాధలం బెట్టుచుండ మోహిని సహింపజాలక, నొకరేయి తగ్గృహంబువాసి యెక మహారణ్యంబునంబడి పోవ బోవ, దైవవశంబున నొక్కచో జటిలమహాముని దివ్యాశ్రమంబు నయన పర్వంబుగాఁ గాన్పించెను. అంత నాయెలనాగ, జటిలమహర్షి పాదంబులం బడి తన వ్రుత్తాంతమంతయు నెఱిఁగించి తరణొపాయముం దెలుపుమని ప్రార్థింప నామహర్షి యా బాలకు ధైర్యముంగలుపి——"బిడ్డా! పరమపావనంబును, నిహపరోత్తారకంబును నగు నాదానందమును నీకు బోధించెదను. దీనిని బవిత్రురాలవుగ"మ్మని పలికి నాదానంద ప్రభావము నెఱిఁగించెను. మునీంద్రునివలన నారాజపుత్రిక నాదానంద ప్రభావము నాలకించి——మోదమంది "యోపుణ్యపురుషా! నాదానంద సౌఖ్యంబు ననుభవించితి, ఇది యిట్టిదని చెప్ప నలవిగాని మహానందము; నాభాగ్యమూలంబున నిట్టి మహానందము గలిగెను దేవవాద్యంబులనన్నింటి నాలకించి ధన్యాత్మనైతి. ఇంక మీపరిచర్యవదలక నేనిందే యుండుదాన, నన్ను ధన్యురాలిం జేయుఁ" డని పలుక నాజడదారి "యో బాలా! నీవు యుక్త వయస్కవగు కాంతవు; నీయున్కి మా తపోనిష్టల కంతరాయమును గల్గించును. కాన నీవిందుండఁజనదు. మిధిలాపురాధి