పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిరకారిమహారాజు కథ

31


డొకవడికి తిలక మరలఁ దాను బాలికనుంచినయెడ కరుదెంచి చూడనందు బాలిక గాన రాదయ్యె; తన్ను భీతిలం జేసిన వ్యాఘ్రమే యా శిశువును గబళించెనని, తలంచి, తిలక మిగుల శోకించుచు, నప్పటి కింకనుమూర్ఛ తేఱని చంద్రరేఖకడ కరుదెంచి కాఁచియుండ నింతలో దైవవశంబున నొక యెఱుకత, మూఁడేండ్ల బాలు నొకనిగొని యటకరు దెంచ నాశిశువు చంద్రరేఖకు జనించిన శిశువని భ్రమించి దానిని వెఱసింప, నది పురుషశిశువుగాని స్త్రీ శిశువుగాదయ్యె——ఆశిశువునకై కొంతధన మిచ్చి తిలక యాయెుఱుక వద్దగొని, యీలోపల మూర్ఛదేఱిన చంద్రరేఖ కాబాలునింజూపి “తల్లీ! నీవు మూర్ఛిల్లినతరి నీకీ బాలుడు జన్మించెను. నీవాఱునెల లోకేమూర్ఛ యందు మునిగియుంటివి. ఈ బాలుఁ డెట్టి విపరీత వేళ జన్మించెనో కాని పుట్టినపుడే దంతములుగల్గియుండెను. నెల దినములలోననే నడువఁగలిగెను. రెండవ నెలలో మాటలు నేర్చెను. ఇప్పుడు మూఁడు నెలలకే మూడేండ్ల వానివలెనున్నాఁడు,” అని పలికెను. చంద్రరేఖయా బాలుంజూచుకొని, చోరాపహృతుండగు కళానిధిని మఱచియుండెను. ఈలోన, నవంతీరాజ్యమునందలి పుష్కరాగ్రహారమునవసించు నోక విప్రుండుకలసికొని యామె తమ ప్రభువునకు సోదరియని యెఱింగి, తనయింటికిఁ గొనిపోయి, స్వపుత్రికంబలె పోషించుచు నబ్బాలకునకు విశారదుం డనునామకరణం బొనరించెను. ఇది యిట్లుండ రాజ్య కాంక్షచే శ్వేతకేతువు కళానిధిని దొంగల మూలమున తస్కఁరింప జేసి చంపింప యత్నించుచుండగా—— హిమాలయంబునకరిగియుండిన , మేధానిధిరాజు, సిద్ధుని వలన నప్పటికి కాయసిద్ధినందఁజాలక మణికొన్ని దినంబులకు రానాజ్ఞాపింపబడి పురంబునకువచ్చుచు, చోరులచే సంహరింపఁ బడనున్న స్వపుత్రుఁడగు కళానిధిని రక్షించి గృహంబునకుఁ గొని తెచ్చెను. ఈలోపల స్వకీయ పాపఫలంబుగా శ్వేతకేతునకుఁ గన్నులుపోవ నాతఁడంధుఁడై పశ్చాత్తాప దుఃఖంబున సోదరుని పాదములంబడి క్షమింపఁ బ్రార్థించెను. రాజు