పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30

పండ్రెండురాజుల కథలు


డగు కళానిధితో, తన సోదరుఁడును అవంతి పురాధిపతియు నగుమంత్ర గుప్తరాజు కడ కరుగుచుండ, మార్గమధ్యంబున, నొక్కచో రాత్రికాలంబున నొండొక విపినంబున శయనింప, నెవ్వఱో చోరులు కుమారు నపహరించిరి. గర్భవతియగు, చంద్రరేఖ యీదారుణంబునకు సహింప నోపక——మూర్ఛమునింగెను. తిలక యామెకుఁగల్గిన విపత్తునకు పగచుచుఁ గంటికి ఱెప్పవోలెఁ గాపాడుచున్నను, చంద్రరేఖ బహుదినంబుల దనుక మూర్ఛ తేరుకొనదయ్యె—— ఇట్టి యవస్థలోననే యొక్క దినంబున నించుక' మూర్ఛ తేఱి, చంద్రరేఖ కుమారునికొఱకై దుఃఖించుచుండ నా మార్గంబున నెం దేనింజను నవంతీపుర వాసియగు నొకవిఫ్రుండట కరుదెంచి, యవంతీపుర రాజగు మంత్రగుప్తుఁడై శత్రువులచే రాజ్యభ్రష్టత నంది యెందో చనియెనను పిడుగుఁబోలినవార్త నెఱిఁగింప——పుండుమీఁద రోకటిపోటుచందంబున నీవార్త చంద్రరేఖకు మఱింత దుర్భరమైతోఁప——మొదలునరికిన పెనువటంబుకరణి మరల మూర్ఛమునింగెను. ఆమూర్ఛయందే యామె సౌజ్జారహిత స్థితియందు ప్రసవింప నొక స్త్రీ శిశువు గలిగెను. కాని యాబాల జన్మించిన కొన్ని గడియలవఱకు గదులకున్నంత, మృతశిశువే జన్మించెనని తలంచి తిలక మిగుల దుఃఖాక్రాంతయై చంద్రరేఖకు స్మృతిగల్లు లోపలనే శిశువును భూస్థాపనం బొనరింపనెంచి, యొకచో గర్తముం ద్రవ్వి, 'బాలికంబూడ్పనుం కించునంతలో, నొకవ్యాఘ్రారాసము వినంబడుటయు నామెభీతిల్లి——బాలిక నందేవిడిచి నికుంజంబున మాటునకుం బలాయితయయ్యెను. ఇంతలోఁ గొందఱు కాటిపాప లామార్గంబున నరుగుచు, నప్పుడే కన్నులు దెఱచి శోకించుచున్న బాలికంగాంచి, తమ వెంటఁ గొనిపోయి, యవంతీ పురంబునఁగల మల్లికయను వేశ్యకు విక్రయించిరి. అట్లు వ్యాఘ్రభీతిచే నరుగుసమయంబున తిలకకుఁ గూడ బాలి కారోదనంబు వినంబడియె—— గాని కాటిపాపలరు దెంచి బాలికం గొని పోయినజాడఁ గాంచదయ్యె——బాలిక రోమ్ముపైఁ గల పుట్టుమచ్చ మాత్రము తిలకస్మృతిపధంబున నుండెను. వ్యాఘ్రభీతితొలంగిన కొం