పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిర కారిమహారాజు కథ

33


పతియు, ధర్మజ్జుఁడును నగు మేధానిధి రాజేంద్రుని ప్రాపున కరుగుము. ఆరాజు నిన్ను స్వపుత్రికనుంబలె గౌరవించి పెంచు" అని పలుక మోహిని, యా మునీంద్రుని యాజ్ఞానుసారంబుగా మిధిలానగరంబున కరిగెను. అట్లు చని, మోహిని యారాజదంపతులతోఁ దన చరిత్రం బెల్ల దాఁచక నెఱిఁగించినంతనే——నిజపుత్రిక గావున, తద్రహస్యంబు నెఱుంగకున్నను, నవ్యాజంబగు వాత్సల్యంబుగలుగ, నాబాలిక నతి ప్రేమంబునఁ బెంచుచుండిరి. మోహినిం గాంచినప్పటినుండియు, విశారదున కామెపై గాఢమగువలపును, కళానిధి కట్టిట్లనినిర్ణయింపరాని యెట్టిదియో యొక ప్రేమంబును గలుగ సాగెను. అంత నవంతీపురాధిపతియగు, మంత్రగుప్తరాజు సమీప రాజన్యుల సహాయంబునంది మగుడ తన రాజ్యంబు నాక్రమించిన, శత్రు భూపాలు నోడించి, రాజ్యంబు సేయుచు, నొక్క నాడు తనసోదరిని బావమఱందిని దర్శించిపోవ సభిలాషంబు వోడమ——ముందుగా మేధానిధి కిట్లోక 'లేఖ వ్రాసి పుత్తెంచెను. "శ్యాలకా! దైవానుగ్రహంబున నారాజ్య వైభవంబులను మరల నందఁగంటిని. మే మందఱ మిందు సేమముగా నున్నారము; కాని నేను రాజ్యభ్రష్టుండనై శత్రురాజుచేఁ దఱుమబడి యొక యరణ్యంబున నరుగునెడ, మత్కుమారుఁడగు విజయుని, మూడేండ్ల వాని, నెవ్వరో తస్కరులు హరించిరి. వానిపోఁబడి నేటిదనుకఁగాన రాదయ్యెను. అదియే నాకును మీ చెలియలికిని మిక్కిలి విచారముగనున్నది. కతివయ దినంబులలో నెను మిమ్మొక్క మాఱుదర్శింప మిధిలకు వచ్చుచున్నాను”. మంత్రగుప్తుఁడు లిఖించి పంపిన లేఖంజూచుకొని విజయునిపోఁబడికిఁ జంద్రరేఖయు, మేధానిధియు విచారమునంది మంత్రగుప్తునిరాక కెదురు చూచుచుండిరి. ఇట్లుండ మోహిని, మహానందముతో నత్యంతమగు చనువున రాజప్రసాదంబున బెరుగుచు, చిత్రములగు కథలతోడను, పరిహాసములతోడను, సంగీతకళా వ్యాసంగము తోడను చంద్రశేఖ నానందింపఁ జేయుచు నొక్కనాడు చంద్రశేఖంబరిహసింపఁదలంచి, పురుషాకృతివహించి యీమెను