పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

పండ్రెండురాజుల కథలు


“కుమారా! నీతండ్రి యీతఁడు కాఁడంటివి. సరే! నీతండ్రి దివ్యపురుషుఁడై నట్లు ఋజువు చేసినచో, నీకు న్యాయముగల్గు " ననెను. అంత నామీనకేతనుఁడు జటాశంకరమునీంద్ర దత్తంబులగు, సర్వమహత్త్వ శక్తులనుఁ గేంద్రీకరించి, నిమీలిత లోచనుఁడై చతుర్దశ భువనంబులయందలి, సమస్తదేవతలను యక్ష నాగ గరుడ కిన్నెర కింపురుష, పిశాచ రాక్షస శాకినీ ఢాకినీ సందోషములం దనమనంబునఁ బ్రార్ధించి, "ఓ దేవాధీశులారా! నాతల్లి మహాపతి వ్రతయగు విశ్వాసంబు నాకుఁగలదు. మీలో నీమెవలన నన్ను గన్న మహాత్ముఁ డెవ్వఁడో యాతఁ డీసభామధ్యంబున కరుగుదెంచి, దర్శనంబిచ్చి, మాయిరువుఱను నిష్కళంక చరిత్రులనుఁగా నొనరింపుఁడని ప్రార్ధింప, నత్యంతాశ్చర్యకరంబుగ నాసభామధ్యంబున భూ నభోంతరాళంబులు నిండు నట్లగ్ని జ్వాలలు వొడమి కన్నులు మిఱుమిట్లుఁ గొల్పుకరణి బ్రహ్మాండంబులగు మహా తేజస్సలు జన్మించి, తత్తేజోరాసుల మధ్యంబుల, సహస్రఫణంబుల తోడను, సహస్రఫణాగ్రముల యందును సహస్రమణులతోడనుఁ బ్రకాశించు నొక్క. నాగరాజు దృద్దర్శితుండయ్యెను. అతని మహత్తమ తేజోరాశిం గాంచ నేఱక, సభ్యులఁదఱుఁ గన్ను లుండియు నంధప్రాయులైరి. తదీయ దిగ్భ్రాంతి నుండి కొండొకవడికిం దెప్పఱిల్లి యారాజు ఫణిరాజుంగాంచి, “యోమహాత్మా! తమరెవ్వ" ఱని ప్రశ్నింప నా నాగేంద్రుఁడు గంభీస్వరంబున, “నో రాజా! నేను వాసుకియను నాగరాజును; నన్నెవ్వఱో మంత్రిబద్ధుం జేసి యిటకీడ్చి తెచ్చిరి. అట్టి సమర్ధతగలవాఁ డెవ్వఁడు? నన్నిందులకుఁ బిలువ గతంబేమి? నాపుడు మీనకేతనుండా వాసుకింగని, “మహాత్మా! నిన్ను మంత్రబద్ధుం జేసి పిలిచినవాఁడను నేనె——ఇచ్చట మాకొక గొప్ప వివాదము పొసంగి యున్నది. దానిం దీర్చఁ బిలిచితి" నని, యనసూయావృత్తాంతమును, తన జన్మప్రకారంబును లోకంబునఁగల యపనిందయు, కౌశికుని వివాదంబును నెఱింగించి" యిందలి వాస్తవంబును దయతో బ్రకటపఱచి యీయపనిందను, కౌశి