పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీన కేతమహారాజు కథ

27


కుని వివాదంబును నీడేర్పుండని పలుక, వాసుని యాయనసూయం గాంచి స్మృతి నభినయించి—— “బాలకా! ఇప్పటికిఁ బదునెనిమిది వత్సరములకు బూర్వమొక్కనాడు 'నేను వేఁగుజామున విహారార్థినై ధారానగర పరిసర సరోవర సమిపంబున సంచరించుచుండ మీయమ్మ యటకు జలార్ధియైచనుఁ దెంచె——అంత నేనీకాంతఁగని మరుల్కొని యారేయి స్వప్నంబునఁ గలసికొని, భ్రమవాపుకొంటిని. తదనంతరం బీకాంతవృత్తాంతము 'నేమఱచితిని. నాటికి నేడు సపుత్రకంబుగా నీ వెలఁదింగాంచితి; ఈ కౌశికుఁడు ధూర్తుఁడై వివాదంబుసల్పి మిమ్ము రచ్చకీడ్చిన పాపఫలంబునకు వీనిపై నా విషజ్వలలం బఱపి సంహరించెద! "నని భీకరాకారుఁఁడై విషజ్యాలలంగక్కఁ దొడందె——కౌశికుఁడు భీతిల్లె——మీన కేతనుఁడు వాసుని పాదములంబడి “తండ్రీ! అజ్ఞుఁడగు నీతుచ్ఛవిప్రున కింతటి ఘోరశిక్ష విధింపఁబని లేదు. రాజశిక్షయే చాలును. మమ్ముఁగాంచి వీనిని క్షమియింపు"మనిన నాతఁడు శాంతించె—— అంతరాజు కౌశికునకు జన్మాంతర కారాగార శిక్ష విధించి వాసుకింగాంచి, " మహాత్మా ! మీరు పూజ్యులు; మీకు తాత్కాలికంబుగఁగల్గిన భ్రమవాపుకొనగోరి యిట్లు స్వప్నంబులందు సమావేశమైనచో నక్కాంత లపనిందల పాలుగారా? ఇది తమకుఁదగిన పనియా? యని మందలింప వాసుకి పశ్చాత్తప్తుఁడై — “రాజా ! నీవనినట్లు నాకార్యంబపరాధంబయగు. తద్దోషమును వాపుకొన నీ బాలుని తల్లితోఁగూడ నాలోకంబునకుఁగొనిపోయి నాసామ్రాజ్యమునందభిషిత్తు నొనరింతును——అదిగాక——నా చెల్లెలు కుమారైయగు, మలయవతియను బాలిక యొకనాడు జటాశంకర మున్యాశ్రమోప్రాంతంబున నీ మీనకేతునుంగని, మోహవేశమునొంది నవయుచున్నయది. దానిని నాకుమారుండగు నీ మీనకేతునకుమారునకిచ్చి వివాహమొనరించెద! దేవీ! అనసూయా! నిన్ను విశేషముగ నపకీర్తిపాలొనరించిన బుద్ధిహీనుఁడ ! నన్ను క్షమింపు"'మని పలుక ననసూయ భర్తృపాదంబున కెఱగి——"దేవా! ఇదినాపురాకృత పాపఫలము; అది