పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీనకేతమహారాజు కథ.

25


విమర్శింతునని యాజ్ఞ సేసెను. ఈలోపల అనసూయను వెదుకఁబోయిన జటాశంకరమహర్షి శిష్యులు కటకపురంబున జఱిగిన యీకథను విని పోయి గురునకు నివేదింప, మీనకేతనుఁ “డార్యా! ఆమెయే నాతల్లియై యుండును. ఈ తరుణంబున నేనటకుఁజని నాతల్లిని రక్షింతు; నాజ్జ దయసేయవే!" యని ప్రార్థింప, నాతఁడు కుమారుని దీవించి, యతఁడు కోరినట్లెల్ల జఱుగునట్లు వరంబు నొసంగి పంపెను. గడువునాటికి, కటకరాజగు భూపేంద్రుని పాముకఱవ నాతఁడు విగత ప్రాణుండయ్యెను. మరణించిన రాజును ప్రేతభూమికిం గొనిపోవుచుండ నెటనుండియో యొక విష వైద్యుఁడు దారికడ్డమై——తన విఔషధులవలన రాజును బ్రదికింతునని పలుక నాశవంబునట మార్గంబుననుంచిరి. అంత నావైద్యుఁడు రాజును విషమంత్రశక్తిచే బ్రదికింప, నారాజు పునర్జీవియై, తన్ను బ్రదికించిన వైద్యునియెడ ప్రీతుండై యాతనికి మంత్రిపదంబు నొసంగెను. ఇది జఱిగిన మరునాడే కౌశికుఁడు తన యభియోగముం దీర్మానింప రాజేంద్రునిఁ బ్రార్ధింప నారా జనసూయంగని యేలనో పొంగిపొరలి వచ్చిన దుఃఖంబు నాపుకొని, యాబాలను విశేషముగ గౌరవించి యామె వలనఁ దచ్చరిత్రంబు నెఱింగియు నీభర్త యెవ్వఁడని యడిగెను. ఆమె నిజవ్రుత్తాంతముం దెల్ప కౌశికుం డడ్డమువచ్చి రాజేంద్రా! దివ్యపురుషు లేమానవ కాంతలతోనైన స్వప్నంబున భోగించుటయు పుత్రుఁడు గల్గుటయు సంభవించునా? ఇది విశ్వాసార్హమేనా? ఈకులట కట్టుకధ నొకదానిని గల్పించినంతనే మీరును విశ్వసింతురా! ఇది తప్పక నా భార్యయే! న్యాయము దయచేయుఁ"డని పలుక నాతఁడేమియుఁ బలుకనేఱక యోచించుచుండెను. ఇంతలో నాసభలోనికి స్ఫురద్రూపంబున మీన కేతనుం డరుదెంచి "రాజేంద్రా! ఈమె నాతల్లి యనసూయ. తండ్రిని నేనెఱుంగను. ఒక దివ్య పురుషుఁడని మాయమ్మ వచించేను. ఇతఁడు మాత్రము నాతండ్రిగాఁడు. న్యాయము దయచేయు! ” మనియెను. అది విని యాభూపతీ మఱింత యాందోళితమనస్కుఁడై తుదకు