పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

పండ్రెండు రాజుల కథలు


కుంతీసుత మధ్యయా ! ఆయడవిలో ననసూయ యట్లుదాహ బాధచే మూర్ఛిలియుండ, ధారానగరవాసియు, ననసూయా వృత్తాంతంబును నెఱింగినవాడును, నామెపై మరుల్గొన్న వాఁడును నగుకౌశికుండను నొక విప్రయువకధూర్తుం డొక్కఁడనసూయ వెన్వెంటనేవచ్చి యామె యొంటరిగనున్న తరి నెఱింగి యది తనయుద్యమంబు నెరవేర్చుకొనఁదగు తరుణమని యామె దాహబాధందనకడనున్న జలంబులం దీర్చి—— సజ్జనుని వోలెనటించుచు, నామెనోదార్చి, యామెను దుప్పధంబునుబట్టించి మినకేతుని వెదకినట్లునటించి, పుత్రునికొఱకై శోకించు నామె నూరార్చుచు, “నేనును కటకపురికేవత్తును. నీకు సహాయముగ నుందు"నని నమ్మఁ బలికి మార్గమధ్యమునందలి ప్రతి గ్రామంబునందును నామెతోఁగలసి బసచేయుచు, నచ్చటివారితో నామె తన భార్యయని చెప్పుటకారంభించెను. అనసూయ యక్కపటబ్రువుని దుష్ప్రవర్తనంబునుగుఱుతించి, యాతనిందీవ్రముగ నిందించెను. కాని యంతతో నాతఁడు తన దురుద్యమంబును విరమింపక, మొండికిఁ దెగించి గ్రామంబుల ప్రజలతో నెల్ల, బంచాయితి వెట్టి యామె తన భార్యయనియుఁ డన్నొల్ల కున్నదనియు, నిట్లే దేశదేశంబులనం దిరుగుచుండుననియుఁ బెద్దగాఁ జెప్పుకొని యేడ్చెను. విన్న వారందరును నయ్యది నిజంబని నమ్మి యామెంగని నీకిది బుద్ధిగాదని మందలింపఁ జోచ్చిరి. అనసూయ చేయునది లేక యీతఁడు నాభర్త గాడని యెంత చెప్పుకొనినను నమ్మువారు లేకపోఁగా యీతఁడు నీభర్త గానిచో నీభర్త యెవ్వఁడని ప్రశ్న చేయ నామె నోరాడదయ్యె. ఇట్టి రాద్ధాంతసిద్ధాంతముల తోడనే క్రమంబుగ వారు కటకపురింజేరి వెదకు కొనుచు ననసూయా మాతామహుని గృహముం జేరిరి. వెంటనే యనసూయ తాతంజూచి తన యుదంతమునుఁ జెప్పుకొని బాంధవ్యము నెఱిఁగింప నాతఁడు విశ్వసించి, కౌశిక నామధేయుఁడగు నక్కపటిని దూషించి యటనుండి సాగనంపెను. అంత నాతఁడు, రాజసన్నిధికరిగి యీసంగతినంతను మొఱవెట్టుకొన నాభూపాలుఁడు కొండొక దినంబున