పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీనకేతుమహారాజు కథ

23


నాజటాశంకర యోగీంద్రుఁ" డబ్బాయీ! విచారింపకుము; మీయమ్మ సజీవయైయుండును. శరీరభంగంబును, మరణంబునుఁ దెలిసికొను ఛాయాపురుషమను దేవరహస్య మొండుగలదు. అద్దానిని నీ కుపదేశించెదను. నే నియమించిన భాతి దృక్కునిల్ఫీ దృశ్యంబగు పురుషునింగాంచి, యాపురుషునియందుఁదోచు, లక్షణములం జెప్పుము. సకార ఓంకారంబును, బిందుసహీత అకారంబునునగు “హంస" యను రెండక్షరములను జపించుచు, హంసునకు విముఖముగా, నిలిచి, నీశరీర చ్ఛాయనుగాంచి, జీవాక్షరస్థానమున దృష్టి నిలిపి, యాదృష్టిం జెదర నీయక—— మేఘంబులయందుఁగాంచుము. అందవయవసహితమగు నొక ఛాయాపురుషాకృతి నీకుగాన్పించును. ఆపురుషునకు శిరోహీనమైనచో, నారు నెలలకును, కరహీనమైనచో మూడు నెలలకును, చరణహీనమైచో నొక్క నెలకును మరణంబుగల్గును. ఆఛాయ యెఱుపుగ నున్నచో, రాజ్యప్రాప్తియు, పసుపుగ నుండినఁ జక్రవర్తిత్వమును తెల్లగా నుండిన శరీర సౌఖ్యమును, నల్లగానుండిన రోగగ్రస్తతయు, మచ్చలుగానుండిన నొడలికి మాఱ్పునుఁ గల్గునని యెఱుంగవలయును. చక్కఁగా బరీక్షించి వచింపుము" నావుడు, మీనకేతనుఁడు తదుపదేశానుసారంబుగఁజూచి, "మునీంద్రా ! తెలుపురంగు పైఁ బసుఫుకలిసినట్లు కాన్పించుచున్న ”దని పలికెను. అందుల కాఋషి యానందించి “కుమారా ! నీకే కోఱంతయునుఁగలుగదనిపలికి యమ్ముని యనసూయన్వేషణార్థమై తన శిష్యులను సలుదిశలకుం బంపి యాకునూరునిచే శుశ్రూషలఁగాంచుచు నాతని కనేక మహద్విషయంబునుగఱపి యాతని మహత్త్వసంపన్నునిఁగా నొనరించె"నని శ్రీకృష్ణుంబలుక నర్జునుడాశ్చర్యప్రముదితాత్ముఁడై "దేవా! ఛాయాపురుష లక్షణంబు నెఱిఁగించి నన్ను ధన్యునిఁ జేసితివి. తదనంతరంబు మీనకేతనుని కథ యేమయ్యె——అనసూయ వృత్తాతం బేమయ్యె; నెఱిగింపవే! " యనిన నాగోవిందుఁడిట్లని చెప్పదొడంగె——