పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

పండ్రెండు రాజుల కథలు.


“మణిమంతా! నీకోరిక యత్యల్పంబే యయ్యును దానిందీర్ప నేనశక్తుండ నగుటం జింతిల్లెద; ప్రస్తుతము మాకును వంగ దేశీయులకు మహాయుద్ధంబు జఱుగుచున్నయది. యుద్ధ సమయంబుల నూతనోద్యోగంబుల నెవ్వఱికిఁ గానియొసంగుట మా నియమంబుగాదు; యుద్ధానంతరంబునఁ గాన్పింతు వేని నిన్నొక సైనికునిగాఁ జేర్చుకొందు" మని పలికెను.

జయసేనుండట నాశాభంగంబునొంది యప్పురిం బాసి, మత్స్య దేశాధీశుని తనయ యగు, మణిమంజరియందే హత్తుకొనిస చిత్తంబుతో నున్మాదుని భాతినొక మహారణ్యంబునంబడిపోవుచు, దనలోఁ దానేమియో గొణుగుకొనుచుండెను. తత్సమీపంబుననేగల, మతంగమహా మున్యాశ్రమమునుండి తచ్ఛిష్యుఁడగు పతంజలి యను బ్రహ్మచారి కుశాదుల సంగ్రహింప నందందుఁ దిరుగుచు, నున్మత్త ప్రాయుఁడై పలువరించుచు మార్గంబుగానక నరుదెంచుచున్న జయసేనుం గాంచి, యాతఁడొక వెఱ్ఱివాఁడై యుండునని తలంచి యాతనింగొని చని నిజగురు సన్నిధానంబున నిలిపెను. ఆ మతంగమహర్షియు జయసేనుని సౌందర్యాది రూపసంపదల కాశ్చర్యపడి, యాతనివలస నాతని నిజచరిత్రం బెల్ల నెఱింగి మిగుల జూలినంది, "యోవత్సా! నీ వెంత వెట్టివాఁడవు! సమస్త విద్యల నామూలాగ్రంబుగా నెఱింగియు, నొక బాలికఁ గాంచి యమిత హేయమైన యద్దాని ముట్టుకొంపనాసించి యిట్లున్మతుండవైతివిగా ! మలమూత్ర దుర్గంధభరితంబగు యోనియందుగల్గు తాత్కాలిక సుఖంబునాసించి శాశ్వతం బైన పుణ్యపదంబును కాలందన్నుకొను వెంగలి, నీకన్న నెవ్వఁడైన నుండునా? నీవిబ్రాంతిని విసర్జించి, కొంత కాలము నా సన్నిధిని, నిలచి, యీ చర్మశల్యాది హేయవస్తుభరితంబగు శరీరముయొక్క యుత్పత్తి తేఱంగంతయు నాలకించి, యన్యజనదుస్సాధ్యంబులగు సమస్త శస్త్రాస్త్ర మంత్ర రహస్యంబులం గఱచి మతిపొ"మ్మని యానతీయ, జయసేనుం డత్యంతానందభరితుండై యమ్మునికి సాష్టాంగ నమస్కారంబుల నొనరించి, “మహాత్మా! నేను ధన్యుడనైతిని. యుష్మద్దర్శ