పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయసేన మహారాజు కథ

13


నంబువలననే ప్రచండవాతాహతింజల్లా చెదరై పోవు మేఘంబుకరణి నా భ్రాంతి సగముతొలంగె—— నాకు జ్ఞానోప దేశంబొనరింపవే!" యని ప్రార్థింప సమ్మతంగ మహాముని జయసేనునకు సాంఖ్యసూత్రంబు నుపదేశించెను. జయసేనుండును, ధన్యుండనై తినని యుప్పొంగుచుఁ గతిపయదినంబులాముని శ్రేష్ఠున కత్యంత భక్తితత్పరుండై శుశ్రూషలంగావించి యొకానొక దినసంబుస, నమ్మతంగ ముని ప్రమోదమాన మానసుఁడై యున్నతరి నామహాత్ముని పాదంబుల నొత్తుచు, “నోమహాత్మా ! మీరుబోధించిన శస్త్రాస్త్ర మహిమంబు లసాధ్యంబులయ్యును, నుపయోగంబు లేమింజేసి, బూడింబోసిన పన్నీఁటికరణి వ్యర్ధంబులగుచున్నయవి. మత్పిత్రు మిత్రుండగు, మత్స్య దేశాధీశ్వరుండిప్పుడు వంగ దేశంబునఁ దన శత్రువులతో రణంబొనరించుచున్నవాఁడు, తమ యాజ్జ యగునేని, నేనును తద్రణంబున కరిగి, తమరు నేర్చిన విద్యా కౌశలముం బ్రదర్శించి సార్థకంబొనరించెద" నని ప్రార్ధింప నమ్మౌని ప్రమోదమానమానసుండై "వత్సా నీకు శుభంబగుగాక!" యని దీవించిపంపెను.

మతంగ మహర్షినివీడ్కోనిచనిన జయసేన మహారాజు కోలది దినంబులకు వంగ దేశముం జేరి, మధ్య దేశాధిపతియగు ఋతుద్వజునకును , వంగ దేశాధిపతి యగు సనంగసేనునకునుం బ్రవర్తిల్లు మహాసంగ్రామముల గాంచి, దేహముప్పొంగ, సనాహూయమానంబుగ మత్సదేశ సైన్యంబులంజేరి, మునిని మనంబునందలంచుకొని తమ్మని దత్తంబులగు నపూర్వ శర సహస్రంబునకు నమస్కరించి సమంత్రికంబుగ వదలిన నత్తూణీరంబులు జాజ్వల్యమానంబులై భూనభోంతరాళంబుల భస్మీపటలంబోనరించు మాడ్కి మహాట్టహాసం బొనరించుచు వంగరాజన్యవ తాకినుల నామావశేషంబొనరించుటం గాంచి, ఋతుధ్వజుండబ్బురంపడి, యీయనాహూయ మానంబగు సహాయం బెవ్వరిదోకోయని విచారించి యెట్టకేలకు జయసేనుంగనుంగొని, “మహాత్మా! నీ వెవ్వండవు; నిర్నిమిత్తంబుగ నిమ్మహా ప్రమాదసమయంబున నిటకరుదెంచి నాకు సహాయంబొనర్ప గతం బేమని