పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జయసేన మహారాజు కథ.

11


మిత్రుండనియు, జెప్పగా విందు. దయార్ద్రహృదయుండును మాకవశ్యము మాననీయ బంధుసమానుండును నగు నీధరాధినాథుని పొంతనే కొన్ని దినంబు లజ్ఞాతకులశీల నామధేయుండనై 'మెలంగెద! ఆవల నా యెడల నాభవానీ దేవి కరుణంజూపు నెడల నిక్కన్య కారత్నంపుపాణినిఁ గూడ గ్రహింప గల్గుదు నేమో!" యని యేమేమియో వెఱ్ఱి యోచనలు సేయుచు మఱలం దనలో—— “అయ్యయ్యో! నేనెంత వెఱ్ఱివాఁడను. పితృ మాతృవిహీనుండడై 'రాజ్యభ్రష్టుండనై యున్న నా కెట్టి పేరాసలు గల్గుచున్నయవి. దురదృష్టశాలినగు నాకీకన్యకామణిం జేపట్టఁగల మహా భాగ్యంబబ్బునే! అట్టి దురాశం బరిత్యజించి యీరాజేంద్రు నోలగంబున భటమాత్రుండనై దినంబులం బుచ్చెదఁగాక!" యని చిత్తమును స్థిరపఱచుకొని, రాజప్రసాదద్వారముం జేరి తనరాకను భట మూలంబున నాస్థానంబునకుం గబురంపెచు, అనతి కాలంబుననే, తద్భటుండరు దెంచి. జయసేనుం జూచి, యోమానవోత్తమా! ప్రస్తుతం బీ దేశాధీశ్వరుం డిందు లేఁడు; వంగ దేశాధీశ్వరునిపై దాడి వెడలియున్న వాఁడు. ఐనను మంత్రిసత్తములుగలరు. దర్శనంబునకు ముదల యొసంగిరి. నీవాస్థానఁబున కరుగవచ్చు. " నని పలికెను. ఆపలుకుల నాలకించి యాశాభంగమునొందియు మంత్రినైన సందర్శించినఁ గొంతఫలంబుగల్గు నేమో యను నతిసూక్ష్మంబగు నాశాబంధము ముందునకీడ్వ, నాస్థానమునకరిగి ప్రెగ్గడను డగ్గఱి నమస్కరించి మోసల నంజలిబద్ధుఁడై నిలువ వినయంధరనాముండగు నమ్మంత్రి యాతని రూపలావణ్య ముఖగాంభీర్యాదులం దిలకించి విస్మయ చేతస్కుడై యాతండొక మహాకులీనుండు గాని సామాన్యుండుగాడని తలంచి, నీయాశయం బేల నిటకేలవచ్చితివి నీ నెవ్వండవని యడుగ జయసేనుండు——"సచివోత్తమా! నాది మగధ రాజ్యంబునకుఁ ప్రధాన నగరంబగు నుజ్జయినీ పురంబు; నా పేరు మణిమంతుఁడు. నేనత్యంత దరిద్రుండనగుటఁ దమయాశ్రయంబున నెద్దియేని భటోద్యోగముం గాంక్షించి వచ్చితి: ” నావుడు వినయంధరుండు——