పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విష్ణువర్ధనమహా రాజు కథ.

111


తులు, ఎట్టకేలకు హృదయములను స్థిమితపరచుకొని, తమ దుహితకు శరీరము నందస్వస్థతగలిగియున్నది గాన వివాహమప్పటికీ నిలిపితి మని కళింగరాజునకు లేఖ వ్రాయించి యతినాధునికొఱకు దేశములందు వెదుక, చారులనంపెను. కాఁబోవు కోడలిశరీరమున నస్వస్థతగానున్నదని విని, కళింగరాజా బాలికంజూచి మాటాడిరమ్మని యిరువురు బ్రాహ్మణులను, ఉజ్జయినీ నగరంబునకంప, వారు వచ్చి ధర్మపాలునిచేఁ పూజితులై—— సావిత్రీ వృత్తాంతంబు నెల్ల నతని ముఖంబున విని, "అయ్యా! మారాజకుమారుఁడగు, విష్ణువర్ధనుండీనడుమ, వివాహంబునొల్లక, విరాగియై దేశంబులం దిరిగి తపస్సిద్ధినంది యొకపురంబున విధివశంబున ఘటితంబైన యోగంబున నొక విరాగిణి యగు రాజపుత్రికను, గాంధర్వంబునఁ బరిణయం బాజెనట! మీతనయ కథకును, మారాజపుత్రుని కథకును సంబంధము గనఁబడుచున్నయది. ఒక వేళ మారాజసుతుఁడు పరిణయమైనబాల మీబాలయేయైనచో, వెదుకఁబోయిన లత కాలికిఁదగిలినట్లే యగుఁగదా!" యని పలుక, విష్ణువర్ధనుం డాశ్చర్యపడి, మీరాజకుమారు నిందురప్పింపుఁడు; ఆయతి యాతండగునో కాఁడో మేమును పోల్పంగలవారమని పలికెను. బ్రాహ్మణులందుల కనుమతించి, తామందే యుండి విష్ణువర్ధను నటకు రమ్మని వ్రాసిరి. ఈలోన, రాజభటులు బంధించి వీణావతి నటకుఁ గొనిరాగా నది, తనకడ రత్న హారము లేదనియు, దాని నిదివఱకే, కళింగ రాజ పుత్రుఁడగు విష్ణువర్ధనునకు విక్రయించితిననియు నుదువ—— యతియే విష్ణువర్ధనుండగుట మణింత దృఢమయ్యెను. అనంతరము విష్ణువర్ధనుండటకు వచ్చుటతోడనే వారోండోరుల గుఱ్తీంచుకొని, సావిత్రీ విష్ణువర్ధనులకు సర్వజనప్రమోదకరముగా మరల వివాహంబొనరించి యానందించిరి. అనతి కాలమునకే, సావిత్రీ గర్భంబున, విష్ణువర్ధనుని ప్రతిబింబ మోయన నొప్పారు చక్కని కుమారుఁడుదయించి వంశము నుధ్ధరించెను. పిదప విష్ణువర్ధనుఁడు బహువర్షములు మాళవ కళింగ రాజ్యములం బాలించి, 'కీర్తిగాంచె" నని