పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

పండ్రెండు రాజుల కథలు


బరిణయమాడి, యారత్నహారమును మెడలో వేసెను. వివాహానంతరమున మూఁడురాత్రము లందు గడుపవలయునని యోగిని నిర్బంధింపగా, మంజరి సావిత్రి నందే వదలి తానొంటిగ నింటి కరిగి, రాజపుత్రిక శరీరమున నస్వస్థతగ నుండుటచే నతఃపురముననే యున్నదని బొంకి యారహస్యమును గప్పిపుచ్చెను. లోకమునందెంతటి దృఢచిత్తముఁ గల కాంతయైనను పురుషసాంగత్యముచేత, అగ్ని స్పర్శతగిలిన లక్కవలె కరగకపోవదుగదా! ఆమూఁడురాత్రుల సాంగత్యమునను, సావిత్రీ యతినాధులవ్రతము లుద్యాపన చెప్పఁ బడినవి. పరిపూర్ణ మదనలీలావినోదంబులం దేలుచు వారా మూఁడురాత్రులును మూఁడుగడియలుగా వెడలఁబుచ్చిరి. త్రిరాత్రానంతరమున, సావిత్రిని మంజరి యధాప్రకారంబుగ, నొరుల కెఱుక పడనిరీతి సౌధాంతరమునఁ బ్రవేశింపఁ జేసెను. భూనాధునకు యతినాధుఁడు చెప్పిన——జోస్యము యదార్థంబయ్యె ననియును, రత్నహార మెట్లువచ్చేనో కానీ, రాజపుత్రి కంఠముం జేరుకొనె ననియును, రాజ్య మునకిఁక వేశ్యాక్రాంత భీతి గల్లదనియును, పౌరు లెల్లయెడలఁ జెప్పుకొనుచుండిరి. ఇంతలో, కళింగ దేశాధీశ్వరుఁడు తన కుమారుఁడగు విష్ణువర్ధనునకు నీకుమార్తెయగు సావిత్రిం జేసికొన నభిలషించుచున్నారము మీయభిప్రాయమే "మని ధర్మపాలునకు వ్రాసెను. పుత్రిక యభిప్రాయంబునకులోనై యామె నవివాహితనుగా నుంచుట లోకాపవాదకు కారణముగ నున్న దనియును కళింగరాజు సంబంధము విడువఁదగినదిగాదనియుఁ దలంచి ధర్మపాలుడు సావిత్రినడుగకయే స్వతంత్రించి, వివాహమున కనుమతించితిమని ప్రత్యుత్తరమిచ్చెను. ఈలోపల సావిత్రికి గర్భచిహ్నంబులు పొడసూపుటయు, రాజదంపతులాశ్చర్య విషాదములతో నిజముఁ జెప్పుమని కూతుంగ్రుచ్చి యడిగిరి. అంతట——మంజరి, తన చెలిగాం ధర్వవిధిని యతీశ్వరుం బరిణయమాడినవార్త నెఱింగించెను. పూజనీయుఁడును మహిమాన్వితుండును నగు యతి తమకల్లుఁడయినందుల కానందమొకవంకను, ఏకపుత్రిక యగు సావిత్రి వైభవశూన్యుండగు సన్యాసింగూడెఁగదా యను విచార మొకవంకను బాధింప, నారాజదంప