పుట:Pandrendu-Raajula-Kathalu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

పండ్రెండురాజుల కథలు


యర్జునునకు శ్రీకృష్ణుడెఱిఁగించి, “ సవ్యసాచీ! ——ద్వాదశ యోగ మహాత్మ్యంబుల నెఱుంగుటచే నీజన్మము కృతార్థత నొందె"నని పలికెను.——

పండ్రెండు రాజుల కథలు.

సంపూర్ణము.

శ్రీకృష్ణార్జునులు ఖాండవమును దహింపఁ జేసినకథ.

పదమూఁడవనాడు కృష్ణుఁడర్జునుంజూచి——“యర్జునా! మనమీ యమునాతీరప్రాంతములందు, పండ్రెండుదినంబులు సుఖలీలలఁ బ్రోద్దులు పుచ్చితిమి! ఇందు, నేనింత కాలము కాలముగడుపుటం జేసి, నాతల్లిదండ్రులు బెంగఁ గొందురు. గోపికలు పలువిధంబుల ననుమానింతురు, ఇచటి కనతిదూరమున, దేవేంద్రుని ఖాండావోద్యానముగలదు. దానిం దిలకించి, గృహాభిముఖులమగుద" మని పలికిన నతండనుమతించెను, అంత నయ్యిరువురును, ఖాండవోద్యానవనమున బ్రవేశించి యందలిరామణీయకమున కచ్చెరువందుచుండ, కంపితాంగుఁడగు నొక భూసురవృద్ధుఁడట కేతెంచి వారి పాదంబులంబడి, “మహాత్ములారా! భూమి నవతరించిన, నరనారాయణ ఋషులారా! బహుకాలమునుండి యిందు మీరాకకై వేచియుంటిని, నేటికిఁ గృతార్థుఁడనై తిని. యజ్ఞాదులయందు విప్రులు నాకమితంబుగా నర్పించిన యాజ్యంబువలన నాకు, ఉబ్బసపు వ్యాధిపట్టుకొనఁ జతుర్మునిఁ దన్ని వారణోపాయము నర్థించితిని. అప్పుడతండు నరనారాయణ మహర్షులు కృష్ణార్జున నామధేయంబుల నవని వెలయుచున్న వారు, వారిని శరణంబు వేడితివేని నీ బాధలు నివారించును. ఖాండవోద్యానవనంబున నీవ్యాధి నుపశమింపఁ జేయగల యోషధులు