పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

45

ఆంద్రీకరణము.


పూర్వము ప్రియా వియోగదుఃఖ సమ్మూర్చితమైన సచిత్త మును కాళిదాసుని మేఘసందేశము, ఖయ్యాము రుబాయతు సంజీవ నౌషధములవలె పునరుజ్జీవింపజేసినవి. నా మిత్రుఁడు పిశుపాటి వేణుగోపాలు (ఇప్పుడు స్వర్గస్థుడు) హైదరాబాదు నుండి ఖయ్యాము రుబాయతును నాకు పంపెను. ఆ కాలమున వివక్త మైన సౌధోపరి స్థలము, రుబాయతు నాకు ఏడుగడగనుండినవి. 1926 అక్టోబరు నెల 10వ తేదీనాంటి రాత్రి ఒంటిఘంట గడచినను నిద్రపట్టక యుండెను. ఏ పుస్తకమును చదువఁబోయినను మనస్సు దాని వై లగ్నమగుటలేదు. హృదయము కలకపాటి నిరయ సదృశ్యమయి హేయ ములును ఘోరములునగు భావములకు ఆలవాలమై యుండెను. నా హృదయముతో సరిపోలుటకో అనునట్లు ఆకాశము కూడ మేఘా చ్ఛన్నమై యుండెను. వై మేడమీఁది బయలులో కూర్చుండి దీపము పెట్టుకొని రుబాయతు చదువుచుంటిని; రుబాయతును ఆంద్రీకరించిన బాగుగనుండునను ఉద్దేశము కలిగినది. ఒకటి రెండు రుబాయీలు అంతలో వానచినుకులు పడనారంభించెను. పడుకగదిలోనికిపోయి తలుపు వేసుకొని నిదురపోప ప్రయత్నించితిని. ప్రయత్నించుకోలంది నిదుర దూరమగుచుండెను. ఏమి చేయునది లేక ప్రొద్దుపొడుచువఱకు రుబాయతు తర్జుమా చేయుచుంటిని. తరు వాత రెండుదినములలో నేను గుర్తు పెట్టిన రుబాయీలన్నియు ఆంద్రీకరించితిని. పానశాల భారతిలో ప్రకటింపఁబడిన. యనంత రము మఱికొన్ని రుబాయీల నాంద్రీకరించి ఇటీవలనే భారతిలో ప్రకటించితిని, నావద్దనున్న రుబాయతునందు 692 రుబాయీలు కలవు. వానినన్నిటిని తర్జుమా చేయుట అనావశక్యము, ఏలయన ఒకే భావము వివిధములుగా పది, లేక ఇరువది. రుబాయీలలో టింపఁబడి యుండును, అవి 5యన్నియు ఖయ్యాము వ్రాసినవి తర్జుమా జేసితిని.