పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44


కాన, నెది ప్రాప్త మైనను గౌరవించు, వలయు వలదని యేర్పఱుపంగలేవు. విధి యనివార్యమని ఖయ్యాము మాటిమాటికి హెచ్చరించు చుండును. ఖయ్యాము జీవితములోని దుఃఖాంశమునే యూది చెప్పెనని కొందరు ఆయనను Pessimist అని పేర్కొనిరి. జీవితము సుఖదుఃఖ మిశ్రమము, వీలైనంతవఱకు సంతోషము ననుభవింపుము. మరణమనివార్యము; దానికిగా చింతపడకుము. దుఃఖములు కూడ విధి నిబద్ధములు గావున ధైర్యముతో ననుభవింపుము అని ఖయ్యాము చెప్పెను. ప్రకృతి తత్త్వమును . గుఱించి తలపోసినవారు లోకము లోని దుఃఖమును మానవ జీవితము యొక్క అస్థిరత్వమును ఎట్లు గుర్తెఱుఁగకుందురు? కారేరాజులు, రాజ్యముల్ గలుగవే, గర్వోన్నతిం జెందరే వారేరీ సిరిమూటగట్టుకొని పోవంజాలిరే, యుర్విపై వేరై నంగలదే అని పోతన పొకొనెను. The boast of heraldry, the pomp of power, And all that beauty, all that wealth e'er gave Await alike th' inevitable hour The paths of glory lead but to the grave. అని థామస్ గ్రే వచించెను. అంతములేని యీభువనమంత పురాతన పొంథశాల; వి శ్రాంతిగృహంబు; నందు నిరుసంజలు రంగులవాకిళుల్ ; ధరా క్రాంతులు' పాదుషాలు బహరామ్ జమిషీడులు వేనవేలుగాఁ గొంతసుఖించి పోయిరెటకో పెరవారికి జోటొసంగుచుక. అని ఖయ్యాము కూడ వచించెను. ఇందు సత్యములేదని యెవరు చెప్పఁగలరు? పానశాల చదువునపుడు జీవితము దుఃఖభాజక మనితోఁచుట కంటే సంతోషమయమనియే స్ఫురించును.