పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

46


ఒకటి కావు. ఖయ్యామును అనుకరించి వ్రాసినవారి పద్యములు అందు చేరియున్నవి. అందువలన నేనొక పద్ధతి నవలంబించితిని. ఒకే విధ మైన రుబాయీలను కొన్నిటి నేర్పరిచి, వానిలో మనోహరములైన రెంటిని మాత్రము గ్రహించితిని; మఱికొన్ని రుబాయీలలో ఒక పాదము మాత్రము క్రొత్త భావమును వెల్లడించును. తక్కిన మూడుపాదములు చర్విత చర్వణముగ నుండును. అట్టియెడ రెండు మూడు రుబాయీలు కలిపి ఒక పద్యముగ వ్రాసితిని, అట్లు వ్రాసి సుమారు అయిదారు పద్యములు మాత్రమే యుండును. నా ఆంద్రీకరణము మూలమునకు టీకవ లేనుండదు. తిక్కన, శ్రీనాథుఁడు మున్నగు అనువక్తలు వహించిన స్వాతంత్ర్యమును నేనును వహించితిని. అట్లనుటవలన నా తర్జుమా మూలమునకంటె భిన్నముగ నుండునని చెప్పుటకాదు. పారసీక జాతీయములలో ప్రటింప బడిన భావము తెలుఁగులో అథ్లె స్ఫురించుటకు ఆవశ్యకములైన మార్పులను, రసపోషణమునకు వలయు కూర్పులను కావించితిని. సహృదయులు నా సేవను ఆదరింతురుగాక! తెలుఁగుందోఁటల బచ్చబీళ్ళ ననురక్తిం బానశాలాప్రతి పలుగావించి ఖయాము కావ్యరసభాండంబుల్ గులాబీలు బు ల్బులిపిట్టల్ మధుపానపాత్రికలు సొంపుల్ గుల్కు సాఖీయు, భూ తల నాకం బొనరింప నిల్పి రసికాంధ్రప్రీతి గావించితిన్. వెమ్మారెడ్డి పాళెము, 10-8-1934. . దువ్వూరి రామిరెడ్డి 51