పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

43


వానిని యగు నా, మధురాసవంబుఁ దమినానఁగ; నేడు విహారభూమి శో భామయమైన యోగళిక పచ్చగిలుంగద రేపు నీపయిన్ . అనియు “మిత్రా, రారమ్ము, సుఖింపు, మీయదను వ్యర్థంబైన దెన్నడున్" అనియు మనల ప్రబోధించును. స్వర్గనరకములు లేవు; మనుష్యునకు ఆనందదాయకములగు వస్తు స్వర్గముననుండునట్లు ఊహింపఁబడుచున్నవి. లోకమునందే యనుభవింపుము, అని ఖయ్యాము చెప్పును. సృష్టికర్త దేవుఁడు కరుణామయుండా? అట్లయిన లోకమునకనుపట్టు మఃఖమునకు, దౌర్జన్యమునకు, విపర్యాసమునకు కారణమేమి? తన చేచేతనొనర్చినట్టి యొకపాత్ర భగ్నముంజేయ నే మనుజుండైనందలంపఁ; డంగములు నిర్మాణంబుగావించి మో హనరూపంబులు మో-దేవే యెదలో నత్యంతరాగంబు గూ ర్చిన దేవుండు మడేలయిట్లు నిజసృష్టింగూల్చు నున్మత్తుఁడై? అకారణ ధ్వంసమునకు దేవుఁడేల పూనుకొనును? ఈ సందేహము ఖయ్యామును బాధించుచుండెను. అతనికి సందేహము కలిగిననే గాని తన్ని వృత్తి గోచరింపదు. ధారుణినుండి యుచ్చశని దాలకు గలట్టి కడింది చిక్కులం బూరితిగా సడల్చితిని; మోసపుటక్కుల బందెగాను; దు ర్వారనిరోధముల్ గడచివచ్చితి; నయ్యును సాయశక్తులం బోరి వదల్ప కే విసిగిపోయితి మృత్యురహస్య బంధమున్. అనుతాపము వలన నేమియు ప్రయోజనము లేదు. పూజలు నమాజులవలన నీ కష్టములు తొలగిపోవు. ఏలయన:- విషము నమృతంపు మసిబుడ్ల విధికలంబు ముంచి లోకులనుదుట లిఖించు మొదటం; గరగ దఱుఁబేద కన్నీటి కాల్వనదియుఁ, బరమభక్తుని అనుతాపవహ్నిః జెడదు.