పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42

మృత్తిక మరల వేటొక శరీర నిర్మాణమునకు వినియోగపడును. ఆత్మ కలడను నమ్మకము లేదు. కావున ఖయ్యాము భౌతిక పునరా వృత్తిని మాత్ర మీట్లు చెవ్పెను. జలజల మంజులార్భటుల జోల్కొను నీ సెలయేటి కోవలన్ మొలచినలేతపచ్చికల మోటుగం”లిడఁబోకు, దేవదూ తల రుచిరాధర ప్రకృతి దాల్చెనొ సుందర మందగామినీ లలిత శరీరమృత్కణములం జిగిరించెనో యేమొ కోమలీ ఇట్టి నమ్మకము ఆంగ్లేయ కవియగు షెల్లీకి కూడ ఉండినట్లు తోఁచుచున్నది. There is not one atom of you earth But once was living man, Nor the minutest drop of rain That hangeth in its thinnesi cloud, But flowed in human vein. మానవులోనరించు కార్యములకు తాము బాధ్యులుకారు. ఏల యన దేవుఁడే శరీరమును, మనస్సును సృజించెను. మనమొనర్చు ప్రతి కార్యమునకును మనస్సే చేరకము. కావున, పాపకార్యము లొనర్చితిమని దేవుఁడు మనల నెట్లు శిక్షించగలడు? అట్టి మనస్సు నాతఁడేల సృజింపవలయును? కుండ సొట్టపోయిన తప్పెవరిది? కుమ్మరిదా, కుండదా? అని ఖయ్యాము ప్రశ్నించును. పాపము చేసితినని అనుతాపము నొందకుము. దేవుఁడు తన తప్పును తానే దిద్దుకొని నన్ను మన్నించునని ధైర్యము చెప్పి యూరడించును. సృష్టి కొలబద్ధము. విధి యనివార్యము. గతము కన్నులఁగట్టదు. భవిష్యదర్ధము సంశయాంధసంవృతము. వర్తమానకాల మొక్కటియే అవశ్యభోగ్యము కావున, ఆమని లేతమబ్బులు ప్రియంబుగ రాగవతీకపోలముల్ తేమగిలంగఁ దుంపురిలు తియ్యని వేళల లేచిరమ్ము