పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

35


మ్మనము సెడంగ నియ్యెడ నమాజొనరింపంగనాను; నీవు చ చ్చినయెడ వీడిపోయెదవు చెపలువోలె నమాజు సై తమున్ . ఖయ్యాము చమత్కారమును హాస్య ప్రియత్వమును తెలిసికొను టకు 28, 30, 47, 81, 96, 11వ సంఖ్యలుగల పద్యములు చదువుండు. ఖయ్యాము గతించిన వెనుక ఆయన పద్యములు క్రమక్రమముగ ప్రజలలో వ్యాపించినవి. కొంతకాలమునకు సంపుటముగ కూర్పఁబడినవి. ఖయ్యాము పద్యములను గుఱించి అక్బరు పొదుషా యిట్లు చెన్నెనని 'అబుని ఆగ్బరి' అను గ్రంథ వ్రాయబడియున్నది: ఖాజా హఫీ జు యొక్క ప్రతి గజలు క్రిందను ఉమఖయ్యాము రుబాయి వ్రాయఁబడవలయును; అట్లు కాని (హఫీ 'జు గజలుతో కూడ ఖయ్యాము రుబాబు చచువ మేని) రుచి ననుభవింపకుండ ద్రాక్షాసవమానినట్లుండును.” ఈ మాటలను బట్టి ఖయ్యాము రుబాయతు ఎంత ప్రజానురంజకమైయుండినదో మన మూహింపవచ్చును. వేమన పద్యముల సంపుటమువలె రుబాయతుకూడ గలగూర Kంవ. కథయుండదు. విషయైక్యముండదు. ప్రతిపద్యమును పూర్వో త్తర నిరపేక్షకమై స్వతంత్రముగ నుండును. ఇందలి పద్యములు విషయమును బట్టి కాక, పొదాంతాక్షరముల ననుసరించి ఆకారాదిగా కూర్పబడియుండును. శిష్యులు, ప్రశిష్యులు, అభిమానులు రచిం చీన పద్యములు కాలానుసారముగ వేమన పద్యములలో చేరి షుమారు ఇన్నూటినుండి మూడు వేల వజకు పెరిగినటుల ఖయ్యాము రుబా యీలుకూడ నూటయేబది మొదలు వేయివఱకు పెరిగినవి. రుబా యతు యొక్క పురాతనమైన వ్రాతప్రతి ఆక్సుఫదులో బోడ్లియన్ పుస్తక భాండాగారమున నున్నది. ఆ ప్రతి క్రీ.వె. 1460 లో అనగా ఖయ్యాము మరణానంతరము 337 సంవత్సరములకు షిరాజు పట్టణమున వ్రాయఁబడినది. దానిలో 158 రుబాయీలు మాత్రమె