పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34


రామబాణముల యైన పద్యములు చెప్పిన కవి వారి దృష్టికి తాళఁడు! ఐననేమి? పూర్వము ప్రబంధకవులు రచించిన కావ్యములెన్నియో విస్మృత ములయి పోయినవి పోగా మిగిలినవి యెన్నియో పుస్తకభాండాగారము లందు పాతఁబడి అర్థానర్థ రూపములతో కోనయూపిరితో బ్రతికి యుండగా వేమనపద్యములు సజీవములై ఆంధ్రుల హృదయపీఠ మునధిష్టించి ప్రమాణీకరింపఁదగిన సూక్తులై సామెతలై వాడుకలో నుండుటయే వాని యోగ్యతకు ప్రబల నిదర్శనము,సాంఘిక దురా చారములను, కపట గురువుల మతవ్యాపారములను, భక్తుల వేష ధారిత్వమును నిర్భయముగఖండించుటయందు యిరువురును మోమోట లేనివారు.


వేమన విరాగియగుటవలన ప్రకృతి సౌందర్యమును వర్ణింపలేదు. ఖయ్యాము భోగలాలసుండును రసార్ద్రహృదయుడునగుటచేత ప్రకృతి రామణీయకమును అద్భుతముగ వర్ణించెను. “రమణీయార్థ ప్రతిపా దక శబ్దము" కావ్యమను సూత్రమున కీతని కవిత్వము ఉదాహరణ ప్రొయముగ నుండును. ఒక్కొక్కప్పుడు అలంకార ప్రియులకు “ఇదియు ఒక కవిత్వమా?” అను సందేహము పొడమునటు “ప్రొద్దు పొడిచినది. ఒక పూఱేకుల మంచు బొట్లు రాలుచున్నవి” అని పొడిమాటలతో నిరలంకృతముగ ఉన్నది ఉన్నట్లుగా చెప్పును. ఈ నిరాడంబరత్వమె ఖయ్యాము కవిత్వమున నొక విశిష్ట గుణమై యలరారుచున్నది. వేమనయందు గోచరింపని హాస్యప్రియత్వము ఖయ్యామునం దగువడుచున్నది. ఈ గుణమువలననే జీవితభారము తేలికయయి, దుఃఖము చులకనయి. జీవనప్రయాసము భరించుట సులభమగు చున్నది. సాధారణముగా ఖయ్యాము అందటి మహ్మదీయులవలె మసీదుకు పోయి నమాజుచేసి యెఱుఁగఁడు. ఒకనాఁడు వినోదా ర్థము మసీదుకు పోయెను. “నమాజు చేయుటకు రండు' అని ఒక స్నేహితుఁడు పిలిచెను. అందుకు - ఖయ్యామిట్లు బదులు చెప్పెను:

మునుపు మసీదువాకిటను ముచ్చెలు దొంగిలిపోతిఁ; బ్రాతపై
చినిఁగెను; నేఁడునున్ మరల జెప్పులకోసము వచ్చినాఁడ; నె