పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

13


యట్లుగాక గణభేదమువలనను పాడాంతాక్షర నియమమువలనను వివిధ గతులతో నొప్పియుండును. ఈ కావ్యమున వీరరసము ప్రధానము; తరువాతిది శాంతరసము. క్రమక్రమముగా ఈ నియమము నశించినది ఫిర్దోసీ షానామా, రూమీ మస్నవీ ఛందస్సునకు ఉత్త మోదాహరణములు.


కసీదా:- విషయమునుబట్టి దీనిని స్తోత్రపాఠములకు సరిపోల్ప వచ్చును. పాదుషాలు, పెద్ద మనుష్యులు, ప్రవక్తలు, మున్నగువారిని స్తుతించుట ఈ కావ్యమున ప్రధానాంశము. సాధారణముగా అర్ధా వేక్ష గల కవులు పొదుషాలను పొగడిన పొగడ్తలే ఈ కావ్యమున నిండి యుండును. దీని నే ఛందస్సులోనైన వ్రాయవచ్చును. అయినను మస్నవీ ఛందస్సులో వ్రాయుట ఆచారమైయున్నది. పదునేడు పాద ములకంటె తక్కువగను నూటయిరువది పాదములకంటె హెచ్చుగను ఈ కావ్యమును రచింపకూడదను నియమము గలదు. పాదాంతము అన్నియు సమాన శబ్దాక్షర నిబద్ధములై యుండవలయును. ఈ కావ్యము ప్రకృతి ప్రియావసంతములలో నేదైన నొకదాని వర్ణనముతో ప్రారంభమయి కవి స్తుతింపఁదలఁచుకొన్న పొదుషా వర్ణనములోనికి దిగును. సాధారణముగ స్తుతులన్నియు కవి సమయ బద్ధములై ప్రబంధకవులు కృతినాధుల వర్ణించిన విధముగ నుండును. ఈ తెగ కావ్యములు రచించినవారిలో అన్వరి, కాఖాని, జహీర్ ఫా'ర్యాబి సుప్రసిద్ధులు.

గజల్ :- దీనికిని మన సీసమాలికకును కొంత సొదృశ్యము గోచరించును. కవికి కంసాలికి సీసము తేలిక" అన్నట్లు విద్యార్థులు మొదలు పండితులవఱకును కవులైనవారును కానివారును ఈ గేయముల నల్లుచుందురు. “గజల్ వ్రాయనివాడు ఖమర్ త్రాపనివాఁడు పొరసీ వేరు పెట్టుకొనఁడ”మ సామెతయే ఈ రచనయొక్క సౌలభ్యమును దెలుపుచున్నది. ఒక తెగ గజలులో ప్రియావిరహాము, వసంతము, ద్రాక్షారసము, ఉద్యానవనము, గులాబి,