పుట:Panasala Duvvuri Ramireddi 1991 123 P.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

బుల్బులి, ప్రియుని త్యాగము, ప్రియురాలి సౌందర్యవర్ణనము మున్నగు శృంగార విషయములు వర్ణింపఁబడియుండును. మఱికొన్నిట సూఫీ' మతతత్త్వములు, నీతులు ప్రకటింపబడియుండును. ఈ కావ్యమున ఐదు మొదలు ఇటువది పొదములవర కుండవచ్చును. కసీదాకువలె పొదాంత నియమము కలదు.షం ంతబ్రీజ్, , సాది, హఫీ 'జ్ , గజలు కావ్య రచనమునందు ప్రముఖులు.

రుబాయి:- ఇది మన తేటగీతికి సరిపోలును. తేటగీతివలె ఇదియు దేశ్యచ్ఛందస్సని చెప్పుదురు. దీని పుట్టుకను గుఱించి దౌలత్ షాహసమర్ఖండి ఇట్లు వ్రాసియున్నాఁడు: “పారసీకమున యాకుబ్ బిన్ లై సఫా'రను పాదుషా యుండెను. అతనికొక చిన్నకుమా రుడుండెను. వానిని చాల గారాబముతో పెంచుకొనుచుండెను, ఈద్ పండుగనాఁడు ఆ బాలుఁడు తోడిబాలురతో కలసి గింజలాట ఆడుచుండెను. వినోదము చూచుట కొఱకు తండ్రియు అచ్చటకు వచ్చి నిలఁబడెను. ఇతర బాలురవలెనే రాజుకుమారుఁడును గింజలను దొరలించెను. ఏడు గింజలు చెండును ముట్టినవి; ఒకటి తప్పిపోయి బాలుఁడు హతాశుఁడయి మఱియొకతూరి గింజను దొరలింపఁగా అది చెండు దగ్గరకు దొరలిపోయెను. సంతోషముపట్టలేక ఆ రాజకుమారుడిట్లనియెను: “ఘల్తాన్ ఘల్తాన్ హమిర్ వద్ తా లబెగో" అనగా దొరలుచు దొరలుచు (ఆ గింజ) చెండు అంచునకు పోవుచున్నదని అర్థము. పొదుషాకీమాటలు వినసొంపుగా నుండెను. అంతట ఆయన ఆస్థాన సచివులను రావించి ఆ వాక్యమును విని పించెను. అది కవిత్వమని వారు చెప్పిరి. అట్టి పాదమె మఱియొ కటి వ్రాయఁబడినది. అది కొన్నాళ్ళ వఱకు ద్విపదగనే వాడుకలో నుండినది. కాని భావము లిముడ్చుటకు రెండు పాదములు చాలవని రెండు ద్విపదల నొకటిగా చేర్చిరి. అదియే రుబోయి యైనది.”


రుబాయికి నాలుగు పాదములుండెను. (పారసీకలాక్షణికులు అర్ధపాదములని అందురు). ఒకటి, రెండు, నాలుగవ పాదములకు నది. అందుకా