పుట:Palle-Padaalu-1928.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాజిరిపాట

జాజిరి జాజిరి గాజుల పాప
జాజుల్ల గూచున్న సన్నపు చాప
చాప చుట్టరే సందారికోట
కోట కోటకు రెండు కొమ్మల జగ్గాల్
జగ్గాలు బట్టుక పల్లెకు పోతె
అప్పుడే నావొల్లు జల్లుమానె
జల్లు మన్న కాడ మల్లెలు రాలె
మల్లెల మాదేవీ తోట్లో ఉన్నాది
గుబ్బాల పడుచుకు గుత్తాపు రవికె
రవి గాదురో రామాల మొగ్గ
మొగ్గగాదురో మోదుగునీడ
నీడ గాదురో నిమ్మల బావి
బావి గాదురో బసుమంతకూర
కూర గాదురో కుమ్మరి మేను
మేను గాదురో మేదరి ఇల్లు
ఇల్లు గాదురో ఈగల తెట్టె
తెట్టె గాదురో బియ్యపు రొట్టె.

చాళుక్య సీమలోని 'కాళ్ల గజ్జ - కంకాళమ్మా' అన్నది నాగరిక పాతుపడ్డ జూజిరి పాట యొక్క కంకాళము. లయ మాత్రము నిలిచింది నేటికి.