పుట:Palle-Padaalu-1928.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జాజిరిపాట

——జాజిరిపాట చర్చరీ వృత్త పరిణామము. తెలుగునాటి జాతీయచందసు - తరువోజి -కూడా సంస్కృతపు ధ్రువాపదపు అవతారమే. జాజిరిపాటలు పన్నీటి జల్లులతో కాకపోయినా కోలాట బృంద గానాల కోలాహలంతో తెలంగాణలో ఇంకా నిలిచివున్నాయి. మాదిరికి రెండు

అల్లోమల్లో రాముల మల్లో
రాయిగదిలె రామశిఖరమై కదిలె
మున్నూటరవయి గుర్రాము కదిలె
గుర్రాన్ని గోట్టి గుట్టకు బెట్టి
గుర్రపుతోలు ఆర్ణఫుజోడు
జోడు గొంచాబోయి జోగయ్యకిస్తె
జోగయ్య రెండూ జొన్నగింజలిచ్చె
జొన్న గింజలు తీసుక ఏలేత్రంబోతె
ఏలేత్రంలో రెండు ఎల్లేడ్లు దొరికె
ఎల్లెడ్ల తీసుక వ్యవసాయం పెట్టి
వలపటి దాన్ని దాపట గట్టి
దాపటి దాన్నీ వలపటగట్టి
ముత్యాల ములుగర్ర తుంటిమీమోచి
బంగారి పగ్గాము పన మీదమోపి
ఈడ్చికొడితే ఇరవైపుట్లు
ఆర్చికొడితే అరవైఫుట్లు

67