పుట:Palle-Padaalu-1928.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తలపాగా

ఈ మూడుపాటలూ చిత్తూరు మండలానివి. వీటిగతికూడా చతురశ్రగతియే. ముందు పాదానికి ఉరకలు వేస్తూ పోవటం గుర్తిస్తే వీటినికూడా కోలాటంపాటలే ననవలసి వస్తుంది

అలోమల్లో రాగూల మల్లు
రాగుల కేసినా రంగూపురిసాప
సాపాదిరుగోలె సౌకారుకోట
కోట్లైన్నీ కొమ్మాలెన్ని
కొమ్మాలనందూన మర్రియాకు
మర్రి మర్రీకే జిల్లేడాకు
జిల్లేడాకూల బెల్లముండె
నీకూ దొరుకాక నక్కాకుదొరికె
ఆటుగుంజి ఇటుగుంజి జివ్వేడాకె
జివ్యోడికాపుల్ మరిమంచోళ్ళు
బతుకూమాని రెండూ మామిళ్ళిచ్చిరి
మామిళ్ళదర్మాన పూతాగూసె
పూతాదర్మాన కాతాగాసె
కాతాదర్మాన పనలేమక్కె
పనలాదర్మాన పైకాలొచ్చె
పైకాలదర్మాన పాగాలొచ్చె
పాగాజుట్టుకొని పల్లేకుపోతే
పల్లేకుక్కాలన్ని బవ్ బప్ మనె
అప్పుడే నాకడుపు జల్లూమనె