పుట:Palle-Padaalu-1928.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

పాపమ్ముచేసుకుని బావిలో పడితే
పైమురికియేగాని పాపాలుపోవు
చేటు కాలమట్ర శంకరుడ నీకు
ఆలిమీది పెండ్లి యెట్లాడినావు ?
ఊరిముందరచేను వేయబోకన్న
ఊళ్లోను వియ్యమ్ము చెయ్యబోకన్న
ఊరిముందరచేను కాకుల్లపాలు
ఊళ్ళోనవియ్యమ్ము కయ్యాలపాలు
చేనుమంచీదని చెప్పబోకన్న
చెరుకన్న రాజనం పండిన్నదాక
ఆలిమంచీదనీ అనబోకురన్న
అదివచ్చి మనలోన అణిగిన్న దాక
అత్తింటి కోడలవు కావుగావున్నె
అజ్ఞసిగ్గులునీకు లేపుగావున్నె
వీపునిండా కొంగేదే ఇరువరసలేవె
మడమతిరగ బట్టేదా? మాటవాసేదే ?

49