పుట:Palle-Padaalu-1928.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరుగుపొరుగులార ఓచెలియలార
అత్త గారారళ్లు చిత్తగించండి
పెత్తనం లాగేసై పేచీలుపోను.

4


కారాలలో కెల్ల రెండుకారాలు
ఉప్పుకార మొకటి ఉపకారమొకటి
వాసాలలో కెల్ల రెండువాసాలు
రాణివాసా మొకటి విశ్వాస మొకటి
కుంటలలో కెల్ల రెండుకుంటల్లు
వడ్లకుంటా ఒకటి వైకుంఠ మొకటి,

5


ఆడదాన్నీ నేను అయిపుడితిగాని
గండ్రగొడ్డలిక్రింద కొమ్మనైనజాలు
గొడ్రాలు బ్రతుకేల కోటిధనమేల
స్వారాజ్యమిచ్చినా సవతిపోరేల
చూడకా ఆడేరు చూచి ఆడేరు
కానకా ఆడేరు కల్లలీ ప్రజలు
పాటలుపాడితే పలవలంటారు
పాడకుంటే జనులు మూగదంటారు

48