పుట:Palle-Padaalu-1928.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాస గుమ్మ

——పని ఆయాసాన్ని తగ్గించుకోటానికి పాడిన పాటలు ఆ పనిని గురించిన ఊహల్నే కీర్తించ నక్కర లేదు. అన్యాపదేశపు టూహలూ ఎత్తి పొడుపులూ, ఆశ్చర్యాలూ, ఏవైనా వుండవచ్చు ఈ పాటల్లో. అందుకే ఒకోక్కచోట వీటి భావార్థాన్ని తెలుసుకోవటము కష్టము. ఈ రెండు పాటల్నీ చూడండి.

గుమ్మా! గుమ్మన్నలార ! గుమ్మన్నలారో! నారాసగుమ్మడీ
తూరుపునున్నాది ! తారుపుగుల్లో ! ౹౹నా౹౹
తారుపు గుల్లాకు | తవ్వంత కొప్పో ! "
తవ్వంత కొప్పూకి ! గుప్పు డేసిపూలో ! "
గుప్పుడేసి పూలకి | తాకట్టు సరుకో! "
తాకట్టు సరుకీకి | తాగుబోతు మొగుడో ! "
తాగుబోతు మొగుడీకి | తాళింపుకూడో ! "
తాళింపుకూడూకు ! తాటి కాయపులుసో ! "

50