పుట:Palle-Padaalu-1928.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒరే ఒరే

చిల్లర రాళ్ళకు మొక్కుచునుం టే
          చిత్తము చెడిపో నోరేఒరే
చిత్తము నందున చిన్మయ రూపుని
          చూచుచు నుండుట సరేసరే
ఒక్క పొద్దులని యెండుచునుంటే
          ఒనరుగ చెడుదువు ఒరే ఒరే
ఏకమైన యా వైభవ మూర్తిని
          చూచుచు నుండుట సరేసరే
నీళ్లలోమునిగీ గొణుగుచు నుంటే
          నిలకడ చెడునుర ఒరేఒ రే
నీళ్లలో వుందే నిర్మల జ్యోతిని
          చూచుచునుండుట సరేసరే
బాధగురువుల పంచను చేరితే
          భావము చెడునుర ఒరేఒరే
భావమందునా బ్రహ్మశాంతినీ
          చూచుచునుండుట సరేసరే
భూములు అడవులు తిరుగుచునుంటే
          బుద్ధులు చెడునుర ఓరేఒరే
బుద్ధిలో వుండే పున్నమచంద్రుని
          చూచుచునుండుట సరేసరే