పుట:Palle-Padaalu-1928.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సిద్ధప్ప కులము

మని ననువివరమడిగితే
చెప్పుడు లోకులకు
లోకులకూ పలుగాకులకు దు
ర్మార్గులకూ ఈ దుష్టులకు ౹౹
ఫాలభాగమున యాలలుపాడుచు
భావము గన్నది నాకులము
ముట్టున బుట్టిందీ కులమూము
ట్టంటున పెరిగినదీ కులము
ముట్టులో హరుడు ముట్టులో శివుడును
ముట్టులో బ్రహ్మం ముగ్గురు మూర్తుల
మూలము దెలిసిందీ కులము
ఇంటిలోపలను యిల్లుగట్టుకుని
మంటలోపల రాట్నం బెట్టుక
కంటిలోపల కదురు పెట్టుకొని
ముక్కులోపల యేకు బెట్టుకొని
చెవులోబాకా చేతికి తీసుక
నారాయణయను నరము తీసుకొని
అష్టాక్షరియను తడికె వేసుకొని
పంచాక్షరియను పంచదీసుకుని
తధిమి తధిమి గుబ దెబగుబ దెబగుబ
ఏకినకులమే మాకులము