పుట:Palle-Padaalu-1928.pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బ్రహ్మముగారి దర్శనము

నే జూచినానే - బ్రహ్మమునాలో - నేజూచినానే
         సద్గురునాలో - నే జూచినానే
నే జూచినానమ్మ నెలతరో తారక
రాజయోగము నందు రంజిలు నాగురుని ౹౹నే౹౹
కన్నూల నడుమాను సన్నంపుదిడ్డినా
తిన్నాగ వెలిగేటి పున్నమచంద్రుని ౹౹నేజూచి౹౹
ఫాల భాగమునందు. సీతజ్యోతుల నడుమ
వోలలాడు చునున్న పరలింగమూర్తిని ౹౹నే౹౹
చూపులలోపల పాపల నడుమను
వ్యాపించి “వెలిగేటి ఆపరంజ్యోతినీ ౹౹నే౹౹
చక్షురాగ్రమునందు పశ్చిమవీధిని
నిక్షేపమయి వెలుగు సాక్షి భూతునినాలో ౹౹నే౹౹
చందమామకు నడుమ కుండలాకృతియని
ఆనందముగ నేడుహరి పోతులూరయ్య ౹౹నే౹౹