పుట:Palle-Padaalu-1928.pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పడవపాట

——ఇది తనకంటె పిన్న వానితో సరసములు మరిగినది. చనువెక్కు వౌట తిట్లు ప్రారంభించినది.

రావూ నేరమ్మంటె | పోవూ నేపొన్ముంటే
          రవ్వాచేసెద వేమిరా ! నీ వెంతో
          రాలూగాయైపోతివిరా ౹౹
మల్లెపందిరికాడ మంచమేసి పరుపేసి
          తెల్లాదుప్పటిపరచినా - దానిపై
          మల్లే మొగ్గలు చల్లి నా ౹౹
పూలాచీరాగట్టి పూసలరైకా తోడిగి
          నీలాల కొప్పు పెట్టినా - దానిపై
          పూలాదండ లేచుట్టినా ౹౹
నోట తాంబూలమూసి కాటికా కన్నీరుగార
          మాటమాని నేనుండినా - దానిపై
          తోటికోడల్ దొమ్ములాడి నా ౹౹
పుట్టింటికి పోదమాని పట్టూ పట్టీ నేనిండా
          పట్టిడీ తాపిపారేసినా - దానిపై
          పట్టుపట్టి విదిలించినా