పుట:Palle-Padaalu-1928.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పనిజేసేసాంపెల్లి ఓబొల్లారపిల్లా !
ఇందూర్ల నాదియిల్లు మారుకట్టుకు నాదిమడిగె
మాసాల కన్న రావమ్మా ఓ బొల్లారపిల్లా !
బొంబాయిల బొట్లసీరె కనుకుట్ల కనులరైకె
నీ కొంగున మల్లె మొగ్గలే ఓ బొల్లారపిల్లా !
బొంబాయిల బొంగులోర్రే యిందూర్లె గంటలేగే
మనరజా ఎత్తి పోతదే ఓ బొల్లారపిల్లా !
కలకలయనబోకు కన్నీరుదియ్యబోకు
మన ఆంతు నుంటె తప్పదే ఓ బొల్లార పిల్లా !
యిందూర్ల జోగిపేట నీ అన్నలున్నారాట
నన్నేమి జెయ్యా జాలరే ఓబొల్లార పిల్లా !