పుట:Palle-Padaalu-1928.pdf/253

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాను పోర

రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ
నన్ను నీ వెరగవా

కన్నుగిరతలలోనె కనుగొన్నావా
రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడా

తొమ్మిది చేరలా శూగుటుయ్యాలలో
ఏజోలి లేకున్న నాజోలినీకేల
రానుపోర గొల్లాడ రాతిరి నల్లోడ

నిండుపున్నమనాడు పండు వెన్నెలలోన
పరుపున్న తొట్టెలో పండినిండున్నాను
రానుపోర గొల్లోడ రాతిరి నల్లోడ.

ఇది కృష్ణునిమీద పాట. చరణములు చాలా ఉన్నట్టు కనబడుతున్నది. హాస్యపుపాటలు అన్న చిల్లర పుస్తకములో ముక్తి కాంతయే ఈ మాటలంటున్నట్టుగా ఉన్నది. శృంగారములో ప్రేమ ముదిరితే భక్తి ఆయిపోవుటము వింత ఏమిటి ?