పుట:Palle-Padaalu-1928.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొయ్మోడు పాట

పల్లవి : అయ్యో : కొయ్యోడ :
అ : ప : ఓరింట్లో తిండికి, లేక పోయింది
         బైటబడాయి కొట్టకురో రయ్యో, కొయ్యోడ ౹౹ఆ౹౹
1 చ: కొయ్యడ కొయ్యడ, బండంటారు
         వానికి బండికి | బస్తలు లేవంట
         వాడికొడుకే | మట్టి బెట్టంట
         వాడి పెళ్లం | సూరకత్తంట
         ఆగుంటకు నీకు | తగునంట్రో ౹౹ఆ౹౹
2 చ: కలిగినకంట్లో ! కాటుక బెడితే
         నాకన్ను మెర మెర ! లాడెరోరయ్యోకొయ్యోడ
         దాని మరిగిన మొగుడు | పొరుగుననుంటె
         మనసు మెరమెర ! లాడెరోరయ్యో కొయ్యోడ |
3 చ: అందము సందము | లేని మొగుండు
         వాడు సందెడుంటే | ఎందుకోరయ్యోర్కొయ్యాడ
         ఎదిగిన పిల్లను | యింట్లో బెట్టి
         బైట మంచం | ఎయ్యకురో రయ్యోర్కొయ్యోడ
 4 చ: చిట్టెమ్మ వచ్చిన | ముహూర్తమునుండి
         దొడ్డెడు గేదలు | చచ్చెనురో ౹౹ర౹౹
         దొడ్డడు గేదెలు | చస్తే, చచ్చేనూ

ఇదికూడ వెలిచని మరిగిన వెలది తలపులనే తెచ్చి చూపించుపాట. ప్రాకృతుల జావళీయా అనిపించుచున్నది. పోలీసు వెంకటస్వామి' అనే బూతులబుంగ ఒక పాట ఉన్నది. ఈ కోవలో "పెక్కులు పాటలున్న వన్నమాట.