పుట:Palle-Padaalu-1928.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాలుకన్నుల వెంకటస్వామి

          ఓ వాలు గన్నుల మువ్వ వెంకటస్వామి
          నిన్ను నేను విడువ జాలరా;
ఇంటిముంగల ఇనపరోలు
సేతిన శాబంతి రోకలి
దంచి దంచి నీవంక సూసితే
ధరణి మీద కాలునిలువదు వెంకటస్వామి
నిన్ను నేను మరవ జాలరా; ౹౹ఓవాలు౹౹

ఉంటే ఈవూళ్ళో ఉండు
పోతే పొరుగు దేశం వెళ్ళు
సుట్టు పట్టల ఏ మూలనున్న
సూడక నామనస్సుండా దెంకటస్వామి
నిన్ను నేను మరవ జాలరా: ౹౹ఓవాలు౹౹

ఎర్ర సెరువు వాలుగు ముక్కలు
గోల కొండ గుల్ల సింతపండు
ఆవాలు ధనియాలు వేసి వండితే
ఆవాసనకీ సుట్టు తిరిగే వెంకటస్వామి
నిన్ను నేను మరువ జాలరా; ౹౹ఓవాలు౹౹

ఓ అందజాడ నాకోడెకాడ
సందె కాడను గోడదూకి
తొంగి చూడ గడబిడాయెను
నాబంగారు మామ వెంకటస్వామి
నిన్ను నేను మరువ జాలరా; ౹౹ఓవాలు౹౹