పుట:Palle-Padaalu-1928.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పోలేరమ్మ మెరకల మీదికి
పొగాకు కెల్తను చిట్టమ్మీ
లమ్మీ చిట్టమ్మీ
చీటికి మాటికి చిట్టమ్మంటా
చీటికి మాటికి చిట్టమ్మంటా
చిట్టమ్మున్న నడీధిలోను
చిన బాబుంతడు 'పెదబాబుంతడు
కరణాలుంటరు కాపూలుంటరు
చిట్టమ్మానీ పిలవకురో రయ్యో కొయ్యోడ ౹౹
"నేకుంద న్నాయుడి కూతుర్నిరో
రయ్యో కొయ్యోడ ౹౹
అబ్బో అబ్బో అలాగునైతే
కురసా కురసా మొక్కలపీటా
కుంద న్నాయుడి కూతురివా
నేమ ద్దెప్పయ్య మనవణ్ణే
లమ్మీ చిట్టమ్మి

ఇంటికి తగిన యిల్లాలురో ౹౹ రయ్యో కొయ్యోడ ౹౹ ఇది ఆసలు పాటలోని భాగము వలెనే ఉన్నది.