పుట:Palle-Padaalu-1928.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10 కోతపాట

కొయ్యండల్లా కొయ్యండీ
కోసీ బణుపూ లెయ్యండీ
వానల వరదల వంగినసేను
వెన్నుల నీనిన వన్నెలసేను
తిన్నగదీసీ మొదలూకోసీ
పసలన్నీని పొంజెట్టావా
గింజలు బందలొ పడిపోకుండా
పొందుగ వెన్నులు కొయ్యండల్లా
కాలంసూత్తే సీతాకాలం
కొడవలిపాటూ జాగర్తల్లా
కాలూసెయ్యీ ఆడింతేనే
కుండలొ కూడు కలిసొత్తాది.

పనిచేస్తున్నప్పుడు పాడే పాటల వస్తువు ఆ పనికి సంబంధించినదే. దేవాలయ గోపురానికి అలంకారాలు ఆ గోపురపు హ్రాస్వరూపములే. భారత దేవాలయాన్ని అలంకరించిన మనసులే ఈ బృహదాంధ్ర సారస్వతాన్ని నిర్మించినది.



14