పుట:Palle-Padaalu-1928.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొంతెమ్మ పాట

——తుమ్మెడి పదములు, వెన్నెల పదములు పాల్కురికి సోమనాధుని కాలము నాటికి తెలుగునాట వెలుగులెత్తినవి. మొదట వేదాంతబోధనం. ఈ పదాలు అక్కరకువచ్చినా, కాలక్రమాన్న ఏకధను పోతపోయుటకైననూ పనికివచ్చినవి. బలిసిన చేనులోపడి, చేల కందిన పనలన్నీ కోసి 'పొంజెట్టుట ' లో ఆందరు కూలివారికీ లయ కుదరదు. ఏదో ఒకటి కుదిరించుటకు తుమ్మెదా అన్న పాణాంత పదాలు బనికివస్తవి. ఈ మాటను అందరూ చేరి పాడతారు.

తోటల్లాలోకి తుమ్మెదా, ఇరగబడి వచ్చింది తుమ్మెదా
దేవసిరినంది తుమ్మెదా, తేరగా వచ్చింది తుమ్మెదా
గొంతెమ్మ పెంచినా తుమ్మెదా, గొలుసుసుళ్ళానంది తుమ్మెదా
యీనిన వరిసేలు తుమ్మెదా, యీదివిడ దొక్కింది తుమ్మెదా
అల్లమూ చెడతిని తుమ్మెదా, పేడకడేసింది తుమ్మెదా
అంతట్లో ఆసేను తుమ్మెదా, కాపన్న వచ్చాడు తుమ్మెదా
ఎక్కడిది యీనంది తుమ్మెదా, ఏడాది యీనంది తుమ్మెదా
వండిన వరిసేలు తుమ్మెదా, పాయలడ తొక్కింది తుమ్మెదా
కట్టండి నందిని తుమ్మెదా, గాజుల్ల కంచాన్ని తుమ్మెదా
ఎయ్యండి నందికి తుమ్మెదా, ఏడుకట్లా చొప్ప తుమ్మెదా
పొయ్మండి నందికి తుమ్మెదా, గోలేలతో కుడితి తుమ్మెదా
అంటానె కాపన్న తుమ్మెదా,గొంతెమ్మ మేడాకు తుమ్మెదా
మేడల్లో గొంతెమ్మ తుమ్మెదా, యేలాగూను వుంది తుమ్మెదా
ఉయ్యాల్లో గొంతెమ్మ తుమ్మెదా, వూగుతూ ఉన్నాది తుమ్మెదా

14