పుట:Palle-Padaalu-1928.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

9 కోతపాట

కోతకొయ్యండమ్మలాలా సేలు
కోరుకున్నా మమ్మలాలా
ఆరు మూడు కాలమైన
అసలుకి మరి కొసరులేదు ...కోత
సోడిసేలు యెన్నులేసి
సోలెడు గింజలకైతే
పాలికాపు బత్తేలకు
సాలొచ్చును కొయ్యండీ ...కోత
దసరా భోగాలంటె
ఆసరా తీరుస్తాయి
పసరాలకి కసవుంటే
భాగ్యాలే పండాయి ...కోత
సాలొచ్చిన మారాజు
సెయిముల గాయిస్తాడు
కాసు సేతపడితేను
గగనమందేముసేను ...కోత

రైతుకు చాలివచ్చిననే చెయ్యిములగా గింజలు కూడా 'కూలివాళ్లకి యిస్తాడు. లేకపోతే ఒప్పుకున్న కాసుమాత్రమే.

—వరిపొలాలకు ఈ చిక్కులేదు. వర్షపాతమెట్లున్నా 'మన్నెపుగొండపై మబ్బులో మెరుపు తీసిపోయిన నదిని పోషించి ' పంట కందించగలదు. వరిచేలలోని చిక్కులు వేరు.

13